జగనన్నా కాస్త వీరి కొట్లాటకు పరిష్కారం చూపించరాదే..!
ys jagan mohan reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అద్బుతమైన సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ అభివృద్దిలో దూసుకు పోతున్నాడు. విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి పరిపాలనలో తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి కొందరు సొంత పార్టీ నాయకులు పెద్ద తలనొప్పిగా మారుతున్నారు. కొందరు పార్టీలో ఉంటూనే మరో పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇక మరి కొందరు పార్టీలో ఉన్న మరో నాయకుడితో గొడవలు పడుతూ తమ పార్టీపై తామే అన్నట్లుగా బురద జల్లుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్తున్నా కూడా ఆయన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పార్టీలో అంతర్ఘత కుమ్ములాటలు అనేవి చాలా కామన్ అనే విషయం తెల్సిందే. వైకాపాలో కూడా అవి కామన్ గానే ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడని అంటున్నారు. చీరాలలో కరణం బలరాం మరియు ఆమంచి కృష్ణ మోహన్ ల మద్య వివాదం చిలికి చిలికి గాలి వాన మాదిరిగా మారింది. కొన్ని వారాల క్రితమే ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. కాని ఆయన ఇద్దరికి సన్నిహితంగా ఉండాలి ఇద్దరు కూడా పార్టీకి అవసరం అన్నట్లుగా పెద్దగా చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు కూడా గొడవ పడి ఇటీవల ఎన్నికల్లో పార్టీకి నష్టం చేశారు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. రెండుగా చీలిపోయిన వైకాపా ను ఒక్కటిగా చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలంటూ వైకాపా నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల జిల్లా పార్టీ నాయకులు స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి అన్నా ఆ గొడవను మీరే చల్లార్చాలన్నా అంటూ విజ్ఞప్తి చేశారట. మరి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికి అయినా ఆ గొడవను పట్టించుకుని ఇద్దరిని మందలించి మళ్లీ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోకుంటా ఉంటారా అనేది చూడాలి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరకు ఈ వివాదం వెళ్లడంతో సీరియస్ గా మారిందంటున్నారు.