Business Idea : ఈ పూల సాగుతో… నెలకు 30,000 పైన ఆదాయం…
Business Idea : మనం డబ్బులు సంపాదించాలంటే మన దేశంలో చేయడానికి ఎన్నో పనులు ఉన్నాయి. అందులో ఒకటే పూల సాగు. ఈ పూల సాగుతో కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మన దేశంలో రైతుల ఎక్కువగా వరి, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తున్నారు. వీటితోపాటు వాణిజ్య పంటలను కూడా పండిస్తున్నారు. వీటికి ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. గ్రామీణ ప్రాంతాలలోని వారు ఈ పూల సాగును చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అందులోనూ కాస్త వెరైటీ పూలను పండిస్తే లాభాలు బాగా వస్తాయి. మన దేశంలో చాలామంది రైతులు గెర్బెరా పూలను సాగు చేస్తున్నారు. ఈ పూలను సాగు చేస్తే లక్షల్లో ఆదాయం పొందవచ్చు. అనేక రాష్ట్రాలు హార్టికల్చర్ మిషన్ కింద గెర్బెరా పూల సాగును ప్రోత్సహిస్తున్నాయి.
గెర్బెరా పూలను సాగు చేసే వారికి ఉచితంగా డ్రిప్, హల్చింగ్, ఆఫ్ హెచ్ పి మోటారు పంపు, షెడ్డు నెట్ అందజేస్తున్నారు. గెర్బెరా పువ్వుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతేకాదు ఈ పంట సాగుకు శ్రమ ఎక్కువగా ఉండదు. షెడ్డు నెట్టులో గెర్బెరా పూలను సాగు చేయాల్సి ఉంటుంది. 30×30 మీటర్ల షెడ్డు 3200- 3300 వరకు ఈ మొక్కలను నాటవచ్చు. ఈ మొక్కలు 90 రోజుల తర్వాత పూలు పూస్తాయి. మొక్క పూల దశకు వచ్చాక బాగా ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఈ మొక్కలు పెద్ద ఎత్తున పువ్వులు పూస్తాయి. ఒక్క నెలలో పది సార్లు పువ్వులను కోయవచ్చు. ప్రతిరోజు 700- 800 పూలను కోయవచ్చు. మార్కెట్లో ఒక్కో గెర్బెరా పువ్వు ధర రూ.5-6 వరకు ఉంటుంది.
నెల రోజుల్లో 75 వేల పూల వరకు సులువుగా వస్తాయి. దీనివలన మీరు 35 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. దీని సాగుకు 5000 ఖర్చు అవుతుంది. అంటే పెట్టుబడిగా రూ.5000 నుపెట్టాలి. అన్ని ఖర్చులు పోగా నెలకు 30,000 మిగులుతాయి. ఆరు నెలల్లో ఒక లక్ష 80000 వరకు సంపాదించవచ్చు. అలాగే ఈ పూల సాగుకు నీటి సదుపాయం బాగా ఉండాలి. అలాగే మొక్కలకు నీళ్లు ఎక్కువగా పోయాలి. షెడ్డు నెట్టుకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ఉండాలి. షెడ్ల కింద ఈ మొక్కలను పెంచడం వలన దుమ్ము ఇతర తెగుళ్ళ బాధలు ఉండవు. రైతులు కష్టపడి సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఈ పూల సాగును చేసుకుంటూ వేరే పనిని కూడా చేసుకోవచ్చు.