Business Idea : ఈ పండును సాగు చేశారంటే… లక్షల్లో ఆదాయం పొందవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఈ పండును సాగు చేశారంటే… లక్షల్లో ఆదాయం పొందవచ్చు…

 Authored By prabhas | The Telugu News | Updated on :17 September 2022,7:00 am

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. అలాంటివారికి వ్యవసాయ రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి. అయితే అందరూ పండించే సాంప్రదాయ పంటలను కాకుండా కాస్త భిన్నమైన వాణిజ్య పంటలను పండిస్తే భారీ ఆదాయాన్ని పొందవచ్చు. వాణిజ్య పంటల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకోగలుగుతారు. అయితే వ్యవసాయం చేయడానికి ఒక మంచి పంట ఉంది. ఖరీదైన పంటల్లో నల్ల జామ ఒకటి. దీని సాగు చేస్తే భారీ ఆదాయం వస్తుంది. అందువల్లే మన దేశంలో నల్లజామ సాగు బాగా పెరిగింది. తక్కువ పెట్టుబడి తోనే ఈ పంటను సాగు చేసి ఎంతోమంది రైతులు లక్షలు సంపాదిస్తున్నారు.

నల్ల జామ చూడడానికి వెరైటీగా ఉంటుంది. ఆకులతో పాటు పండులోని గుజ్జు కూడా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఒక్కో పండు 100 గ్రాముల బరువు వరకు పెరుగుతుంది. చూసేందుకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పండ్లు ఎక్కువగా శీతల ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. చీడపీడల బాధ కూడా ఉండదు. ఎలాంటి వ్యాధులు కూడా సోకవు. నల్ల జామ పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో అవసరమైన పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఈ పండులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు యవ్వనంగా ఉండేందుకు సహాయపడుతాయి.

Business Idea in Black guava farming earn lakhs of rupees

Business Idea in Black guava farming earn lakhs of rupees

అందుకే మార్కెట్లో నల్లజామ పండుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నల్లజామ రకాన్ని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు సృష్టించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా దీనిని పండిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, యూపీలోని పలు ప్రాంతాల రైతులు ఈ పంటను పండిస్తున్నారు. దేశంలో ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండే జామకాయలు మాత్రమే మార్కెట్లో దొరికేవి. కానీ ఇప్పుడు పెద్దపెద్ద నగరాల్లో ముదురు ఎరుపు రంగులో ఉండే జామ పండు కూడా దొరుకుతున్నాయి. మార్కెట్లో ఒక్కో పండు ధర 50 వరకు పలుకుతుంది. ఈ పంటను కనుక పండిస్తే భారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పంట సాగు గురించి సమీపంలోని అగ్రికల్చర్ కాలేజీకి వెళ్లి అధికారులను సంప్రదించి మరిన్ని వివరాలను తెలుసుకొని ఈ పంటను సాగు చేయాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది