Business Idea : ఈ బిజినెస్ చేసారంటే తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందవచ్చు…
Business Idea : చాలామంది ఏదో ఒక ఉద్యోగం చేసే కన్నా సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని ఆలోచిస్తుంటారు. ఒకరి కింద కష్టపడి పని చేసే బదులు మనమే సొంతంగా వ్యాపారం పెట్టుకొని కష్టపడి సంపాదించుకోవచ్చు అని అనుకుంటుంటారు. కరోనా వచ్చిన సమయంలో ప్రైవేట్ ఉద్యోగుల బాధలు ఇప్పటికీ మర్చిపోలేం. కొన్ని కంపెనీలు తమ తమ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించారు. ఇలా ఎంతోమంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. తర్వాత కొంతమంది సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. మరి కొంత మంది తమ వృత్తి పనులు చేసుకుంటూ ఉండిపోయారు. చేసుకునే శక్తి ఉన్న కొందరు పెట్టుబడి పెట్టలేక సొంత వ్యాపారం చేయలేక పోతున్నారు. కొందరేమో పెట్టుబడి పెట్టగలిగే స్తోమత ఉన్న ఏ వ్యాపారం చేయాలో అర్థం కాదు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా అనిపిస్తుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యాపారాలను ప్రారంభించి ప్రజలను స్వయం సమృద్ధిగా మారేలా ఎంతగానో ప్రోత్సహిస్తుంది.
దీని వలన అటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను ప్రజలకు అందేలా చేస్తుంది. ఈ పథకాల సహాయంతో ఎంతోమంది తక్కువ పెట్టుబడితో తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం ప్రారంభించడం ఎవరైనా చేస్తారు కానీ దానిని సరైన మార్గంలో వ్యాపారం చేస్తే ఆదాయం దానంతట అదే వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో మీరు కనుక మంచి మార్గాన్ని ఎంచుకున్నారంటే తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టిన వ్యాపారాన్ని అధిక రాబడిని పొందవచ్చు. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈ వ్యాపారం ప్రారంభించడానికి కనీసం 25 వేల రూపాయలు వరకు పెట్టుబడిగా పెట్టాలి. దీని తర్వాత మీరు 5 సంవత్సరాలలో సులువుగా 72 లక్షలు సంపాదించవచ్చు. ఆ వ్యాపారం పేరు యూకలిప్టస్ ఫార్మింగ్. గ్రామాలలో దీని సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు.

Business Idea invest 25 thousand rupees and earn 72 lakhs rupees in these business
అయితే యూకలిప్టస్ సాగును సరైన పద్ధతిలో కనుక సాగు చేశారంటే మంచి ఆదాయం వస్తుంది. ఈ సాగుకు అనుకూల ప్రదేశం అంటూ ఏమి లేదు. దీనిపై ఎటువంటి వాతావరణం ప్రభావం ఉండదు. దేశంలో ఎక్కడైనా సరే వేయవచ్చు. మొక్కలను నర్సరీలో ఒక్కొక్కటి ఏడు నుంచి ఎనిమిది రూపాయలకు అమ్ముతారు. ఒక హెక్టార్ విస్తీర్ణంలో వీటిని మూడువేల మొక్కల వరకు నాటవచ్చు. ఈ చెట్లను ఎక్కువగా పెట్టెలు, ఫర్నిచర్, గుజ్జు, హార్డ్ బోర్డు వంటి వాటికి ఉపయోగిస్తారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో వీటిని పండిస్తారు. అయితే యూకలిప్టస్ మొక్కలను నాటిన దగ్గర నుంచి పెద్దగా పెరిగే వరకు కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. తరువాత ఒక హెక్టారుకు యూకలిప్టస్ చెట్లను అమ్మడం వలన 72 లక్షల వరకు రాబడి పొందవచ్చు. దాని వలన తక్కువ పెట్టుబడితో అధిక రాబడును సులువుగా పొందవచ్చు.