Business Idea : ఒకప్పుడు కేఎఫ్‌సి, మెక్ డోనల్స్ లో పని చేసి.. దాన్ని తలదన్నేలా హాట్ డాగ్లు అమ్ముతూ.. రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడు..
Business Idea : ఇండోర్ చప్పన్ దుకాణ్ స్ట్రీట్ లోని విజయ్ సింగ్ రాథోడ్ ది 120 చదరపు అడుగుల చిన్న దుకాణం. ఈ షాప్ లో కేఎఫ్‌సి, మెక్ డోనల్స్ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ లోని హంగులు, ఏసీలు లాంటివి ఏమీ ఉండవు.. కానీ వేడి తవాతో అతను సంపాదిస్తున్న లాభం ఆ కంపెనీలనే ఆశ్చర్యపరుస్తున్నాయ్. ఆసియా పసిఫిక్ మొత్తంలో ఊబర్ ఈట్స్ లో అత్యధికంగా ఆర్డర్ చేయబసిన వంటకంగా ఈ దుకాణంలో హాట్ డాగ్ స్థానం సంపాదించింది. అసలు విజయ్ సింగ్ రాథోడ్ కథేమిటో తెలుసుకుందామా..ఇరవై సంవత్సరాల క్రితం, విజయ్ సింగ్ రోజుకు దాదాపు 50 , 60 హాట్ డాగ్లు కూడా అమ్మలేక పోయేవాడు..
అప్పుడు ఒక హాట్ డాగ్‌కి కేవలం 75 పైసలు మాత్రమే. ప్రస్తుతం, రోజూ దాదాపు 4,000 హాట్ డాగ్‌లను సులభంగా అమ్మేస్తున్నాడు. ప్రస్తుతం ఒక హాట్ డాగ్ రూ.30. ‘ఈ విజయం దేశంలోని చిన్న పట్టణాలు, నగరాల్లో వ్యాపిస్తున్న..డిజిటల్ విప్లవానిది. 2005 నుంచి, నా వ్యాపారం బాగా పెరిగింది. మేము గత సంవత్సరం ఫుడ్ డెలివరీ యాప్‌తో టై అయిన తర్వాత, అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.’- విజయ్ సింగ్ గత సంవత్సరం, విజయ్ సింగ్ ‘జానీ హాట్ డాగ్’ వార్షిక ఆదాయం రూ. 3 కోట్లు. కేవలం రూ. నుండి 1978 లో అతను దుకాణం ప్రారంభించిప్పుడు… సంవత్సరానికి రూ.500 వచ్చేది.
‘నేను హాట్ డాగ్ తయారు చేయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, నేను అందరికంటే.. ప్రత్యేకంగా ఏదైనా చేయాల నుకున్నాను. రెండు, సమోసా , కచోరీ తయారీకి పెట్టుబడి ఎక్కువ. కాబట్టి, నేను మళ్లీ మా అమ్మ సహాయం తీసుకున్నాను. ఆలూ టిక్కీని ఎలా తయారు చేయాలో ఆమె నాకు నేర్పింది.నేను దానిని కొత్తగా ఆలోచించి.. బ్రెడ్ ఉంచాను.. చివరగా, నేను నెయ్యిలో శాండ్‌విచ్‌ను కాల్చాను. కస్టమర్లలో క్యూరియాసిటీని పెంచడానికి వాటికి ‘హాట్ డాగ్స్’ అని పేరు పెట్టా. నేను ఇప్పటి వరకు అసలైన హాట్ డాగ్ టేస్ట్ కూడా చేయలేదు.’ – విజయ్ సింగ్