Business Idea : ఇంట్లో మీకు ఉన్న స్థలంలో తక్కువ సమయంలోనే.. ఈ పంటలు సాగు ఎలాగో తెలుసా..
Business Idea : కరోనా పాండమిక్ తర్వాత చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో ఎక్కువగా కల్తీ ఆహారం లభిస్తుంది. కూరగాయల సాగులో ఎక్కువగా ఫెస్టిసైడ్స్ వాడటం వల్ల వీటిని తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నో దీర్ఘకాలరోగాలకు కారణం అవుతున్నాయి. చిన్నపిల్లలో కూడా ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయి. ఒకప్పుడు సహజంగా లభించే ఎరువులు వేసి సాగు చేసేవారు. దీంతో రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపేవికావు. ఎన్ని వ్యాధులొచ్చినా తట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఫెస్టిసైడ్స్ ఉపయోగించిన ఫుడ్ తీసుకుని రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. దీంతో చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మార్పు చాలా వచ్చింది. కరోనా కూడా ఫుడ్ పరంగా అలెర్ట్ చేసింది.
ఆర్గానిక్ పద్దతిలో పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు మాత్రమే కాదు ప్రతి పంట ఆర్గానిక్ పద్ధతుల్లో పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. పంట ఎదగడానికి, చీడ, పీడలను కంట్రోల్ చేయడానికి ఎలాంటి కెమికల్స్ వాడకుండా పశువుల పేడ, సహజ ఉత్పత్తులను మాత్రమే వాడి పర్యావరణానికి కూడా మేలు చేస్తున్నారు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. కాగా ఈ మధ్యకాలంలో మిద్దెతోటలపై కూడా చాలా అవగాహన పెరగింది. చాలా మంది పట్టణాల్లో బిల్డింగ్స్ పై కుండీల్లో, నాణ్యమైన ఎర్ర మట్టి పోసి అందులో వితనాలును చల్లుకుని మొక్కలు పెంచి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో ఇంటి పెరట్లో కూరగాయల మొక్కలను సహజ పద్దతుల్లో సాగు చేస్తున్నారు.
అయితే తక్కువ సమయంలో మనకు కావల్సిన కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు చూద్దాం…. ముల్లంగి చాలా త్వరగా దిగుబడినిచ్చే కూరగాయ. నాటిన మూడు నాలుగు వారాల్లోనే ముల్లంగి కోతకొస్తుంది. వీటి సాగు కుండీలలో లేదా పోసిన మట్టిలో కూడా పెంచవచ్చు. విత్తినాలు చల్లితే మూడు నాలుగు రోజులలో ముల్లంగి మొలకెత్తుతుంది. ఆతర్వాత మొక్కలను నాటుకుంటే నాలుగువారాల్లో ముల్లంగి తినడానికి రెడీ అవుతుంది. అలాగే పాలకూర విత్తినాలు చల్లుకుంటే 30 రోజులలోపు పాలకూరను కోసేయచ్చు. అలాగే క్యారెట్ ని కూడా కాస్తా టైమ్ పట్టినా సులభంగా సాగు చేసుకోవచ్చు. ఆరువారాల్లో క్యారెట్ రెడీ అవుతుంది. అలాగే ఉల్లి గుత్తులను నాటిన 3 లేదా 4 వారాలలోపు కోయవచ్చు. ఉల్లిపాయ ఆకులను సూప్‌లు లేదా వేయించిన పదార్ధాలలో కలిపి తీసుకుంటారు. అదే ఉల్లిపాయల కోసం పెంచినట్లైతే ఆరు వారాల్లో అందుతుంది.