Business Idea : ఉద్యోగం చేయలేకపోతున్నారా.. అయితే ఈ పంట సాగుతో లక్షల్లో ఆదాయాన్ని పొందండి..
Business Idea : చాలామంది కరోనా వచ్చాక తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా వలన ఎన్నో కంపెనీలు చాలామంది ఉద్యోగులను తీసివేశారు. అయితే వారిలో కొందరు సొంత వ్యాపారం చేసుకుని జీవిస్తున్నారు. మరికొందరు వాళ్ళ సొంతూర్లకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ రైతుగా మారుతున్నారు. ప్రస్తుతం జాబ్ లేకపోయినా ఉద్యోగం బోర్ కొట్టిన మీరు కూడా వ్యవసాయం చేయవచ్చు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించి లక్షలు సంపాదించవచ్చు. అందులో ఒకటి జీలకర్ర సాగు. ఈ జీలకర్రను ప్రతి ఒక్కరు వాడుతారు. వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన ఐటమ్ ఇది. అంతే కాదు జీలకర్రలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అందుకే మార్కెట్లో జీలకర్రకు ఏడాది పొడవున డిమాండ్ ఉంటుంది. అయితే జీలకర్ర సాగు ఎలా చేయాలో, ఎంత లాభం వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్రను మన దేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలోని 80 శాతానికి పైగా పండిస్తున్నారు. ఈ పంటను రాజస్థాన్ లో ఎక్కువ మంది రైతులు సాగు చేస్తారు. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఒక్క రాజస్థానే 28% వాటాను కలిగి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పంట పెద్దగా కనిపించదు. జీలకర్రను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని అన్ని విధాల సిద్ధం చేసుకోవాలి. మంచిగా దున్ని మట్టి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే తేలికగా ఉండే భూముల్లో జీలకర్ర బాగా పండుతుంది. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. గట్టిగా ఉండే నెలల్లో జీలకర్ర సాగు చేస్తే మనం అనుకున్నంత దిగుబడి రాదు.జీలకర్ర విత్తనాలలో మూడు రకాల పేర్లు వినిపిస్తున్నాయి. RZ 19, 209, RZ 223,GC1-2-3 రకాలు మంచివని మార్కెట్లో పేరు ఉంది. ఈ రకాల విత్తనాలను వేస్తే 120- 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది.
ఒక హెక్టారుకు 510 నుంచి 530 కిలోల దిగుబడి వస్తుంది. అందువలన ఈ రకాల విత్తనాలతో జీలకర్ర పండిస్తే మంచి రాబడి వస్తుంది. సుమారుగా 30000 నుంచి 35 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పంట బాగా పండితే ఒక హెక్టారుకు ఏడూ ఎనిమిది క్వింటాళ్ల జీలకర్ర విత్తనాలు వస్తాయి. జీలకర్ర కిలో వంద రూపాయలుగా తీసుకుంటే అన్ని ఖర్చులు పోను, హెక్టర్కు 40,000 నుంచి 50 వేల వరకు నికర లాభం పొందవచ్చు. ఒకవేళ ఐదు ఎకరాల భూమిలో జీలకర్రను పండిస్తే రెండు నుంచి 2.5 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. నాలుగు నెలల పంటకు రెండున్నర లక్షల ఆదాయం అంటే నెలకు దాదాపుగా రూ.60,000 వస్తాయి. దీనికి మించిన పంట ఇంకొకటి ఉండదు. కనుక జాబ్ చేయలేనివారు ఈ పంటను సాగు చేస్తే మంచి ఆదాయాన్ని పొందుతారు.