Business Idea : వీటిని శీతాకాలంలో పండించండి పెద్ద మొత్తంలో లాభాలను సొంతం చేసుకోండి…!
Business Idea : రైతులు రకరకాల పంటలను పండిస్తూ ఉంటారు. అయితే పెద్దగా వాటి నుంచి ఎటువంటి లాభం పొందరు.. ఈ డిసెంబర్ మాసంలో కొన్ని రకాల పంటలను పండించడం వలన పెద్ద మొత్తంలో డబ్బులు మీ సొంతం చేసుకోవచ్చు.. ఈ చలికాలంలో వీటికి ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉంటూ ఉంటుంది. అలాగే మంచి ధరలు కూడా ఉంటాయి. మార్కెట్లో సుమారు సంవత్సరమంతా ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. అయితే కొన్ని కూరగాయలకు ప్రత్యేక సీజన్ […]
Business Idea : రైతులు రకరకాల పంటలను పండిస్తూ ఉంటారు. అయితే పెద్దగా వాటి నుంచి ఎటువంటి లాభం పొందరు.. ఈ డిసెంబర్ మాసంలో కొన్ని రకాల పంటలను పండించడం వలన పెద్ద మొత్తంలో డబ్బులు మీ సొంతం చేసుకోవచ్చు.. ఈ చలికాలంలో వీటికి ఎక్కువగా మార్కెట్లో డిమాండ్ ఉంటూ ఉంటుంది. అలాగే మంచి ధరలు కూడా ఉంటాయి. మార్కెట్లో సుమారు సంవత్సరమంతా ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతూ ఉంటాయి. అయితే కొన్ని కూరగాయలకు ప్రత్యేక సీజన్ అంటూ ఉంటుంది. ఆ టైంలోనే అవి దొరుకుతాయి. కొన్ని కూరగాయలు ఆకుకూరలు చలికాలంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఈ టైంలో ప్రజలు వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వాటికి మంచి డిమాండ్ ఉంటూ ఉంటుంది. ఈ శీతాకాలంలో పండించే కొన్ని రకాల కూరగాయలు గురించి ఇప్పుడు చూద్దాం… ఈ కూరగాయలు కొన్ని ఏ కాలంలోనైనా పండుతాయి.
అయితే మిగతా టైంలో వీటిని దిగుబడి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. డిసెంబర్లో వీటిని పండించడం వలన అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చు. ఈ కాలంలో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే పలుకుతుంది.. అవసల సాగు : ఈ అవసల సాగు వలన మీరు రెండు రకాల ఉపయోగాలు పొందుతారు. ఈ పంట పూర్తిగా పండినప్పుడు మీరు దీనిని అమ్మడం వలన డబ్బు సంపాదించవచ్చు. అదే టైంలో డిమాండ్ కూడా ఉంటుంది. కావున ముందుగా ఆవాలను అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అధిక దిగుబడి నుంచి ఆవాలలో క్రాంతి, మాయ ,వరుణ తదితర రకాల ముఖ్యమైనవి నీటి వసతి ఉన్న ప్రదేశాలలో ఆవాలు చల్లడానికి హెక్టార్ కి 5 నుంచి 6 కేజీల విత్తనాలు వాడుకోవాలి. లోమినేల ఆవాల సాగుకు అత్యంత అనుకూలమైనది. ఆవాలు వేడి చేస్తాయి. కాబట్టి శీతాకాలంలో వీటి వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది.
మెంతికూర : ఇది కూడా ఆవాల లాగానే మెంతులు కూడా మీకు అధిక లాభాలు వస్తాయి. ఈ పంట చాలా సులభమైన పంట వేసిన తర్వాత మీరు రోజు నీటిని పెట్టాలి. పంట తర్వాత 25 నుంచి 30 రోజుల తర్వాత దీన్ని ఆకులు ఆకుకూరల వంటకి సిద్ధంగా ఉంటాయి. మీరు దీన్ని చాలాసార్లు కట్ చేసి అమ్ముకోవచ్చు. నీరు పోసాక మళ్ళీ మొక్కలు కొత్తగా వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆకులు ఆకుకూరల వంటలకి అనుకూలంగా ఉన్నంతవరకు మీరు వాటిని పండించవచ్చు. పూలు వచ్చాక ఆకుల కోయకుండా నీరు పోస్తూ ఉంటే మెంతులు కూడా పండుతూ ఉంటాయి. ఈ మెంతులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీనికి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.
వంకాయ : ఈ వంకాయ మొక్కలను మొదట నర్సరిలో పెంచుతారు. ఆ తర్వాత వాటిని వరిలాగా నాటుతూ ఉంటారు. మీరు ఈ మొక్కల్ని మార్కెట్లో సులభంగా తీసుకోవచ్చు. మీరు ఇంట్లో కూడా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. వంకాయ మొక్కలు నాలుగైదు వారాలు వయసు వచ్చినప్పుడు వాటిని పొలంలో నాటుతారు. ఈ నాటేటప్పుడు మొక్కల మధ్య దూరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ప్రధానం వాటిని కనీసం ఒకటి నుండి ఒకటిన్నర అడుగుల దూరంలో పెట్టాలి. వరుసగా మొక్కలు పెట్టడం వల్ల మీరు వంకాయలు కోయడం చాలా ఈజీ అవుతుంది కావున దీనిని గుర్తుంచుకోవాలి. వీటికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది.
పాలకూర : పాలకూర చల్లని వాతాల్లో పండే పంట దీనికి అనువైన వాతావరణాన్ని సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. మిగిలిన సీజన్తో పోలిస్తే చలికాలంలో దిగబడి చాలా ఎక్కువగా ఉంటుంది. పాలకూర రకాలలో గ్రీన్ రోమన్ రకాలు అధికంగా దిగబడింది. పంట వేశాక మొక్కల నుంచి చాలా సార్లు ఆకుల్ని కోసి దిగబడి చేసుకోవచ్చు. ఈ చలికాలంలో మళ్లీ పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు.. ఈ పాలకూరకి మార్కెట్లు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది.