Business Idea : రూ.80 లోన్ తీసుకొని పాపడాల బిజినెస్ పెట్టి.. రూ.1600 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : రూ.80 లోన్ తీసుకొని పాపడాల బిజినెస్ పెట్టి.. రూ.1600 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.. ఎక్కడో తెలుసా?

 Authored By jyothi | The Telugu News | Updated on :16 February 2022,8:30 pm

Business Idea : పెట్టిన పెట్టుబడి.. రూ.80.. ఇప్పుడు వస్తున్న రాబడి రూ.1600 కోట్లు.. ఈ లభాలు చూసి ఎవరో బిజినెస్ లో పండిపోయిన వారు వ్యాపారాన్ని నడిపిస్తున్నారని అనుకుంటారేమో.. ఈ కోట్ల బిజినెస్ నడుపుతోంది.. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఏడుగురు మ‌హిళ‌లు. వారికి ఏ బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేదు. పెద్దగా చదువు కోలేదు.ఇప్పుడు 69 ప్రాంతాల్లో 42వేల మంది ఉద్యోగుల‌తో వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఆ మ‌హిళ‌లు ఎవ‌రో కాదు శ్రీ మ‌హిళా గృహ ఉద్యోగ్ లిజ్జ‌త్ పాప‌డ్ వ్య‌వ‌స్థాప‌కులు.1959లో ముంబై గూర్ గావ్ ప్రాంతానికి చెందిన లోహ‌న నివాస్ అనే బిల్డింగ్లో నివాసం ఉంటున్న గుజ‌రాతి కుటుంబాల‌కు చెందిన జశ్వంతిబెన్ జమ్నాదాస్ పోపాట్, పార్వతీబెన్ రామదాస్ తోడాని, ఉజాంబెన్ నారందాస్ కుండాలియా, బానుబెన్.

ఎన్. తన్నా, లగుబెన్ అమృతలాల్ గోకాని, జయబెన్ వి. విఠలానీ, దివాలిబెన్ లుక్కా అనే ఏడుగురు మ‌హిళ‌లు క‌లిసి ఏదైనా బిజినెస్ పెట్టాల‌ని అనుకున్నారు. వాళ్ల పెట్టుబడి కేవలం.. రూ. 80.. కోట్ల విలువైన నమ్మకం. తమకు తెలిసిన పాపడ్‌ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. దానికి లిజ్జత్ పాప‌డ్ అని పేరు పెట్టారు. లిజ్జత్ అంటే అంద‌రూ ఎద‌గాలని అర్ధం.మంచి క్వాలిటీ, టేస్ట్ తో పాప‌డ్ ను త‌యారు చేయ‌డంతో ఇత‌ర దుకాణాలకు చెందిన వ్యాపారులు లిజ్జత్ పాప‌డ్‌ల‌ను కొనుగోలు చేయ‌డం ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగా వ్యాపారాన్ని విస్తరించేంత పెట్టుబడి వారి దగ్గర లేదు. అప్పుడే వారికో ఐడియా తట్టింది. ఇంటి దగ్గర ఉండే మహిళలన్ని తమ వ్యాపారంలో భాగస్వాములను చేశారు. పాపడాలు తయారు చేసే పనిని వారికి అప్పగించారు. తక్కువ పని, తక్కువ జీతం ఎక్కువ ఉత్పత్తి సాధ్యమైంది.

Business Idea success story of lijjat papad

Business Idea success story of lijjat papad

అలా ముంబైలో లిజ్జత్‌ ఇంటింటా ఓ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది.లిజ్జత్‌ ఎదిగే క్రమంలో అండగా నిలిచిన వర్కర్లందరికీ ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నారు. లిజ్జత్‌ పాపడ్‌ స్థాపించిన ఐదేళ్ల తర్వాత దానిని శ్రీ మహిళా గృహ ఉద్యోగ్‌ లిజ్జత్‌ లిమిటెడ్‌ సంస్థగా మార్చారు. అందులో పని చేసే కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి వరకు అందరికీ కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. ఇది మనది అనే భావన కలిగించారు. కంపెనీలో లాభాలు వ‌చ్చినా, న‌ష్టాలు వ‌చ్చినా మ‌హిళ‌లంద‌రూ స‌మానంగా పంచుకునేలా తీర్మాణం చేశారు.ఏడుగురు మహిళలు ఏర్పాటు చేసిన లిజ్జత్‌ ఈరోజు మహా వృక్షంగా మారింది. దేశంలో 67 బ్రాంచీల్లో 42 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. మనదేశంలో పాటు 15 దేశాలకు ఈ పాపడ్‌లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం లిజ్జత్‌ కంపెనీ ఏడాది టర్నోవర్‌ ఏకంగా రూ. 1600 కోట్ల రూపాయల పైమాటే..

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది