Business idea : ఓవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు దేశాలన్నీ తిరుగుతూ యూట్యూబ్ లో వీడియోలు పెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు..!
Business idea : కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక…కొత్త దేశం, కొత్త నగరం, కొత్త పల్లె… అక్కడి వింతలు, విశేషాలు, ఆ ప్రాంతం గొప్పదనం, సౌందర్యం, అక్కడి వంటకాలు… అన్నింటినీ ఆస్వాదించాలన్న ఆకాంక్ష. కోరిక ఉంటే సరిపోదు.. ఈ ప్రపంచం మొత్తం చుట్టి రావాలంటే.. చేతి నిండా డబ్బు, బోలెడంత ఖాళీ సమయం ఉండాగా అనుకుంటున్నారా. కానీ బోలెడంత డబ్బులేకున్నా.. కొత్త ప్రదేశాలకు వెళ్లి రావాలనే ఆసక్తి ఉంటే చాలని అంటున్నారు విశాఖపట్నానికి చెందిన రవి ప్రభు.. ఇప్పటి వరకూ రవి.. ప్రపంచంలోని 186 దేశాలను చుట్టారు. ప్రస్తుతం అమెరికాలోని రిచ్‌మండ్‌లో స్థిరపడిన ఆయన.. మరో 9 దేశాలకు వెళ్తే.. ప్రపంచాన్ని చుట్టొచ్చిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుకెక్కుతారు. దేశాలు మొత్తం తిరిగేస్తున్నాడు.. ఇతనేదో.. మిలినియర్ అనుకుంటున్నారా… నాన్న స్టేట్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ కాలేజీ లెక్చరర్.
రవి ప్రభు ఒడిశాలోని తెలుగు కుటుంబంలో జన్మినిచ్చినప్పటికీ.. ఆయన బాల్యం మొత్తం వైజాగ్‌లోనే గడిచింది. ఆయనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు భూటాన్ తీసుకెళ్లారు. రవి చూసిన తొలి విదేశం ఇదే.పదహారేళ్ల క్రితం హైదరాబాద్‌లో పీజీ పూర్తి చేశాక పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువయ్యాక అక్కడే స్థిరపడ్డాడు. తొలి సంపాదనతో యూఎస్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లి ఆమ్‌స్టర్‌డామ్ నగరాన్ని చూసొచ్చాడు. ఆఫ్రికాలోని పలు దేశాలతో పాటూ బ్రెజిల్, ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, ఇజ్రాయెల్… ఇలా చెప్పుకుంటూ పోతే అతను పర్యటించిన 186 దేశాల పేర్లు చెప్పాలి. ఏడాదిలోనే 18 దేశాలు తిరిగొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. తాను సందర్శించిన ప్రాంతాల విశేషాలు అందరికీ తెలియజేయాలని ‘రవి తెలుగు ట్రావెలర్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి కాకుండా పేదల సాయానికి వినియోగిస్తున్నాడట.

Business idea teulgu traveller who visited 186 countries
.’మన చుట్టూ ఉండేదే ప్రపంచం కాదు.. నా పర్యటనల ద్వారా అనుభవపూర్వకంగా ఈ ప్రపంచాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. విభిన్న సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవడంతోపాటు.. ప్రపంచాన్ని మరింతగా అర్థం చేసుకోగలుగుతున్నా… నేను చాలా సంస్థలతో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను.ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను. అటు ఉద్యోగాన్ని, ఇటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ.. 186 దేశాలను చుట్టొచ్చాను. ‘ – రవిరవి ప్రపంచ దేశాల పర్యటన అంత ఇజీగా ఏమీ సాగలేదు. కొన్ని సందర్భాల్లో మోసపోవడం.., యాక్సిడెంట్లు కావడం, ఫ్లైట్ మిస్ కావడం, ఆహారం దొరక్కపోవడం.. ఇలాంటివెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ తన ఇష్టం ముందు అవేమంత కష్టం అనిపించలేదంట. కొన్ని ప్రదేశాలకు వెళ్తే తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలిసినా.. చాలా సింపుల్ గా వెళ్లోస్తారు రవి.