Business idea : ఈ మూడు రకాల ఆకులతో రైతులు లక్షాధికారులు కావొచ్చు…అది ఎలాగంటే…
Business idea : ఆధునిక కాలంలో చాలామంది ఏదో ఒక ఉద్యోగం చేసే కన్నా సొంత వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటారు. ఒకరి కింద కష్టపడి పని చేసే కన్నా సొంతంగా వ్యాపారం పెట్టుకొని బాగా కష్టపడితే మనకే మంచి లాభాలు వస్తాయి కదా అని అనుకుంటుంటారు. అలాగే మంచి లాభాలను తీసుకొచ్చే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటే ఆకుల వ్యాపారం. మన భారతదేశంలో ఆకుల వ్యాపారం భారీ ఎత్తున జరుగుతుంది. వివిధ రకాల ఆకులను శుభకార్యాలకు, పూజలకు వాడుతుంటాం. మరికొన్ని ఆకులను తినే ఆహారంలో ఉపయోగిస్తారు. అందుకే వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అవి ఏమి ఆకులు, వాటి వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఆకులలో బాగా ముఖ్యమైనవి, బాగా ఉపయోగపడేవి తమలపాకులు, అరటి ఆకులు, సాఖూ ఆకులు.
వీటికి మార్కెట్లో చాలా అంటే చాలా పెద్ద డిమాండ్ నే ఉంది. ఉత్తర , తూర్పు భారతదేశంలో తమలపాకులకు మంచి గిరాకీ ఉంది. దక్షిణ భారతదేశంలో అరటి ఆకులకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా సాఖూ ఆకులను కొండప్రాంతాలవారు ఎక్కువగా వాడతారు. వీటికి అక్కడ మంచి డిమాండ్ నే ఉంది. అందువలన రైతులు ఈ మూడు ఆకులను పండిస్తే సులువుగా లక్షాధికారులు కావొచ్చు. ఈ ఆకులను సాగు చేస్తే అనుకొని అంత అధిక రాబడి వస్తుంది.ఈ ఆకులకు మంచి డిమాండ్ ఉంది కనుక సొంత వ్యాపారం చేయాలనుకున్నవారు ఈ మూడు ఆకులను సాగు చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. తమలపాకులను మన భారతదేశం వారు అనేక సందర్భాలలో వాడుతుంటారు. ముఖ్యంగా తమలపాకులను శుభకార్యాలకు, పూజలకు ఎక్కువగా వాడుతారు. అంతేకాకుండా వీటిని ఎక్కువగా పాన్ షాప్ లలో వాడుతారు. వివిధ రకాల పాన్ లలో వీటిని ఉపయోగిస్తారు.
భోజనం చేసాక ఈ ఆకులను నోట్లో కిల్లీగా వేసుకొని నములుతారు. అందుకే తమలపాకులకు మంచి గిరాకీ ఉంది. రైతులు ఈ తమలపాకు తోటలను సాగు చేస్తే భారీగా లాభాలను పొందవచ్చు. అలాగే సాఖూ ఆకులకు కూడా మార్కెట్లో మంచి ఆదాయమే ఉంది. ఈ ఆకులను ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల వారు పండిస్తారు. దీని ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటిని అరటి ఆకులు లాగానే వివిధ కార్యక్రమాలలో భోజనం వడ్డించడానికి ఉపయోగిస్తారు. సాకు చెటంల ఆకులే కాదు, కలప కూడా చాలా విలువైనది. సాఖూ చెట్లను సాగు చేస్తే అటు ఆకుల నుంచి, ఇటు కలప నుంచి పెద్ద ఎత్తులో ఆదాయం పొందవచ్చు. అలాగే అరటి ఆకులకు దక్షిణ భారతదేశంలో అధిక డిమాండ్ ఉంది. వీటిని వివిధ రకాల శుభకార్యాలకు ,పూజలకు వాడుతారు. ఎక్కువగా వివిధ కార్యక్రమాలలో ఆహారం వడ్డించేందుకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. అరటి పండ్లకు కూడా బాగా గిరాకీ ఉంది. అరటి తోటను సాగు చేస్తే అటు పండ్ల ద్వారా,ఇటు ఆకుల ద్వారా అధిక రాబడి వస్తుంది.