Business Idea : ఈ పంట సాగు తో 8 లక్షల ఆదాయం నాలుగే నెలలు చాలు… ఇక మీరు కుబేరులు అవ్వాల్సిందే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఈ పంట సాగు తో 8 లక్షల ఆదాయం నాలుగే నెలలు చాలు… ఇక మీరు కుబేరులు అవ్వాల్సిందే..

 Authored By prabhas | The Telugu News | Updated on :21 July 2022,5:00 pm

Business Idea : రైతే రాజు అన్న సామెత మీరు వినే ఉంటారు. కానీ ఈ సామెత చెప్పుకోవడానికి మాత్రమే బావుంటుంది. ఆచరణలో పెట్టడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు రకరకాల పంటలు పండిస్తున్నాడు. కానీ సరియైనటువంటి ఆదాయము పంట పైన రావడం లేదు. ఆరుకాలం కష్టించి పండించిన పంట ,చేతికి రాబోయే లోపు పంట పైన అనేక రకాల కారణాల వల్ల పంట నష్టపోతున్నారు. వాతావరణ పరిస్థితులు కావచ్చు ,పంటపైన చీడపీడలు కావచ్చు ,సరియైన ధర లభించకపోవచ్చు ,మంచి దిగుబడి నిచ్చే విత్తనాలు లభించకపోవచ్చు.

మరియు మార్కెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు రైతు ప్రతి ఏడాది ఎదుర్కొంటున్న సమస్యలు, ఇలాంటి పరిస్థితిలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల కుటుంబాలు కృంగిపోతున్నాయి, కుషించిపోతున్నాయి, చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని రైతు ఒక కొత్త రకం పంటను పండించాలని ఆలోచిస్తున్నారా… అయితే అతి తక్కువ ఖర్చుతో దోస పంటను మొదలుపెట్టండి. ఈ పంట ద్వారా ఆదాయం లక్షల కు లక్షలు సంపాదించుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ లోని ఒకానొక రైతు తన సొంత పొలంలో దోస సాగును సాగు చేశాడు.

Business Idea Use these crops to get rich in 4 months

Business Idea Use these crops to get rich in 4 months

ఆ పంటకు అతి తక్కువ కాలంలో నాలుగు అంటే నాలుగే నెలలో రూ 8 . లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. దీనికోసం నెదర్లాండ్స్ నుంచి దోస సీడ్స్ ను తెప్పించి ,తన సొంత పొలంలో పంట సాగు చేశాడు. వీటికి మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది. ఈ దోస ఎటువంటి భూమిలోనైనా పండుతుంది. ఈ దోసకాయ పంట 60 రోజుల నుండి 80 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ దోసకు ఎండాకాలంలో మంచి తర పలుకుతుంది. ఈ దోసకాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ దోసను ఇప్పుడు ప్రతి మ్యారేజ్, ఫంక్షన్లలో వడ్డించడం జరుగుతుంది. ఈ దోస సంవత్సరం పొడవునా మంచి ధర ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది