Business Idea : తక్కువ పెట్టుబడితో బిజినెస్.. నెలకు రూ.50 వేల వరకు ఆదాయం
Business Idea : చాలామంది జాబ్ చేయడానికి ఇష్టపడరు. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి తమకు తాముగా ఎదగాలని కోరుకుంటారు. జాబ్ తో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందరికీ తెలిసిందే. అదే మన బిజినెస్ అయితే మన రూల్స్.. మన గోల్స్.. కష్టపడి, ఇష్టపడి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తాం.. ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతిదానికి పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏ బిజినెస్ ఎంచుకోవాలో తెలియక చాలా మంది డైలమాలో ఉంటారు. అలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే బిజినెస్ ఎంటీ.. ఎలా ప్రారంభించాలని లాభాలు ఎలా రాబట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ మధ్య కాలంలో కుకింగ్ అయిల్ రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే రూపాయలు వందకు పైగా పెరిగింది.
ఈ నేపథ్యంలోనే చాలా మంది దృష్టి అయిల్ బిజినెస్ పై పడింది. ఈ అయిల్ తయారీని బిజినెస్ గా మార్చుకుంటే మంచి లాభాలు పొందవచ్చు. అయితే పెద్ద పెద్ద మిల్లులు ప్రారంభించాలంటే అధిక ఖర్చుతో కూడుకున్నది. కానీ మీడియం స్థాయి పోర్టబుల్ మషిన్స్ తో ప్రారంభిస్తే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ వ్యాపారం ఎక్కడైనా ప్రారంభించచ్చు. చిన్నపాటి షెడ్డు లేదా కాస్తా పెద్దగా ఉన్న ఇల్లు కూడా ఇందుకు అనుకూలంగా ఉంటుంది. ఆయిల్ తయారు చేయడానికి అవసరమైన పంట అంటే వేరుశనగ, నువ్వులు లాంటి ధాన్యాలు అవసరం. లెటెస్ట్ మషిన్స్ సహాయంతో పై ధాన్యాల నూనెను అతి తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా చాలా సులభంగా తీయవచ్చు. అయిల్ వ్యాపారం ప్రారంభించడానికి మీడియం సైజు యంత్రాన్ని ఎంచుకుని కొనుగోలు చేసుకోవాలి. అలాగే దీని ఖరీదు దాదాపు రెండు లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి.
Business Idea : రెండు లక్షలతో యంత్రం కొనుగోలు
అలాగే ఫుడ్ లైసెన్స్ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకోవాలి. మొత్తంగా ఈ వ్యాపారానికి 3 నుంచి 4 లక్షలు పెట్టుబడిగా పెట్టుకోవాలి. అయితే నూనే తయారీలో పద్దతులు పాటించి క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అప్పుడే డిమాండ్ ఉంటుంది. అలాగే మార్కెటింగ్ అనేది కూడా చాలా ముఖ్యం చిన్న చిన్న ప్రకటనల ద్వారా పబ్లిసిటీ కల్పించుకుని కస్టమర్లను ఆకట్టుకోవాలి. అలాగే అయిల్ ని సరైన ఆకర్షణీయమైన ప్యాకింగ్ లో తయారు చేసుకోవాలి. కాగా అయిల్ సేల్ ని హోల్ సేల్ రిటైల్ కస్టమర్లతో ఒప్పందం చేసుకుని బిజినెస్ ని పెంచుకోవచ్చు. మంచి డిమాండ్, తక్కువ ధరకు ముడి సరుకు సేకరించుకున్నట్లయితే మంచి లాబాలు పొందవచ్చు. అలాగే నూనె తయారీ వ్యర్థాలను పశువుల దాణాకు అమ్ముకుని మరింత ఆదాయం పొందవచ్చు. అనుకున్నట్లుగా వ్యాపారం క్లిక్ అయితే నెలకు దాదాపు రూ.20 వేల నుంచి 50 వేల వరకు లాభాలు పొందవచ్చు.