Business Ideas : రూ.150 తో రూ. 19 లక్షలు దక్కించుకోవచ్చు.. ఎలాగంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Ideas : రూ.150 తో రూ. 19 లక్షలు దక్కించుకోవచ్చు.. ఎలాగంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Business Ideas : రూ.150 తో రూ. 19 లక్షలు దక్కించుకోవచ్చు.. ఎలాగంటే..!

Business Ideas : ఈ రోజుల్లో పిల్లల చదువుల ఖర్చులు, పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు పెద్ద భారం అవుతున్నాయి. తక్కువ ఆదాయ సంపాదించే వారికీ ఒక్కసారిగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం చాలా కష్టమే. అలాంటి సమయంలో చిన్న చిన్న పొదుపుల ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని కూడబెట్టే అవకాశం ఇవ్వడానికి LIC అందిస్తున్న ప్రత్యేకమైన పథకం “చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ”. ఈ పథకం ద్వారా రోజుకు కేవలం రూ.150 చెల్లిస్తూ, మెచ్యూరిటీ సమయంలో రూ.19 లక్షల వరకు పొందే అవకాశం ఉంది.

Business Ideas రూ150 తో రూ 19 లక్షలు దక్కించుకోవచ్చు ఎలాగంటే

Business Ideas : రూ.150 తో రూ. 19 లక్షలు దక్కించుకోవచ్చు.. ఎలాగంటే..!

Business Ideas రూ.150 కడితే 19 లక్షలు పొందే అవకాశం..!

ఈ పాలసీలో 0 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీ గరిష్టంగా 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో ఉంటుంది. ఉదాహరణకి, ఒక బాలుడికి 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ పాలసీ తీసుకుంటే, ఆయన 25 ఏళ్లు వచ్చే వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. పాలసీ వ్యవధిలో 18, 20, 22 ఏళ్ల వయస్సుల్లో ప్రాథమిక హామీ మొత్తం లో 20 శాతం చొప్పున పొందవచ్చు. చివరికి 25వ ఏట మిగిలిన మొత్తం బోనస్‌తో కలిసి లభిస్తుంది.

రోజుకు రూ.150 చొప్పున అంటే సంవత్సరానికి సుమారు రూ.55,000 చెల్లిస్తూ, మొత్తం 25 సంవత్సరాల్లో రూ.14 లక్షల పెట్టుబడిగా మారుతుంది. అయితే, LIC ఇచ్చే బోనస్, వడ్డీ లాభాలతో కలిసి ఈ మొత్తమే రూ.19 లక్షలుగా మారుతుంది. దీని వలన పిల్లల భవిష్యత్తు కోసం నిర్బంధత లేకుండా, సురక్షితంగా పొదుపు చేయడానికి ఇది ఉత్తమమైన స్కీముగా చెప్పవచ్చు. ప్రతి తల్లిదండ్రి తన బిడ్డ భవిష్యత్తు కోసం తప్పకుండా ఈ విధమైన భద్రత కలిగిన పథకాలను పరిశీలించాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది