Business Idea : ప్రభుత్వ సబ్సిడీతో… లక్షల్లో ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్…
Business Idea : కరోనా వచ్చాక ఎంతోమంది ఆర్థికంగా కృంగిపోయారు. చాలామంది తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. ఇలా ఎందరో తమ ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. తరువాత కొందరు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి కొందరు వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయారు. చాలామంది వరకు వ్యవసాయాన్ని తమ సంపాదన మార్గంగా చేసుకున్నారు. సాంప్రదాయ వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఆధునిక వ్యవసాయం వలన చాలామంది లక్షల్లో రూపాయలను పోగు చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో చాలామంది ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల పంటలు, పువ్వులు మొదలగు వాటిని పండిస్తున్నారు. ఈ పంటల ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.
బే ఆకు సాగు కూడా చాలా లాభదాయకమైన వ్యాపారం. ఈ వ్యాపారాన్ని కమర్షియల్ పద్ధతిలో సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక రాబడిని పొందవచ్చు. బే ఆకు సాగుకు ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. అలాగే ఈ సాగుకు తక్కువ ఖర్చు అవుతుంది. బే ఆకు సాగుకు అయ్యే ఖర్చులకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. ఈ ఆకు సాగు సులభంగా మొదలు పెట్టొచ్చు. ఈ బే ఆకు మొక్కలను నాలుగు నుంచి ఆరు మీటర్ల దూరంలో నాటాలి.లైన్ నుండి లైన్ మధ్య కూడా తగినంత దూరం ఉంచాలి. ప్రతిరోజు నీటిని అందించాల్సి ఉంటుంది. బే ఆకు మొక్కలు చిన్నగా ఉన్నంతవరకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలను కూడా నాటుకోవచ్చు. ఇలా నాటడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
ఈ సాగుకు 30% సబ్సిడీ కూడా లభిస్తుంది. ఒక బే ఆకు మొక్క నుంచి ఏటా 5000 వరకు ఆదాయం పొందవచ్చు. మీరు 25 బే ఆకు మొక్కలను నాటితే ఏటా 75 వేల నుండి ఒక లక్ష 25 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. ఇంతకన్నా ఎక్కువగా మొక్కలు నాటితే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం మీ మార్కెటింగ్ వ్యూహంపై కూడా ఆధారపడి ఉంటుంది. మీరు మీ ఉత్పత్తిని మధ్యవర్తి లేకుండా అమ్మితే ఎక్కువ లాభాన్ని పొందుతారు. ఒకవేళ మీకు కస్టమర్లు ఎక్కువగా ఉంటే మీకు ఇతర రైతుల నుంచి ఆకులను తీసుకొని వాటిని మరింత విక్రయించడం ద్వారా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కనుక బిజినెస్ చేయాలనుకునేవారు ఈ బే ఆకు బిజినెస్ చేశారంటే మరింత ఆదాయాన్ని పొందవచ్చు