Business News : రూ.లక్షకు నాలుగు కోట్ల లాభం.. ఎందులోనంటే..?
Business News : జనరల్‌గా డబ్బు సంపాదించడానికి చాలా మంది హార్డ్ వర్క్ చేస్తుండటం మనం చూడొచ్చు. ఎంతో కష్టపడి భౌతికంగా శ్రమ చేసి డబ్బు సంపాదిస్తుంటారు. అయితే, మరి కొందరు మాత్రం స్మార్ట్ వర్క్ చేసి డబ్బు సంపాదిస్తుంటారు. అలా స్మార్ట్ వర్క్ చేయడం కిందకు స్టాక్ మార్కెట్ వస్తుంది. అయితే, ఇందులో రిస్క్ కూడా చాలానే ఉంటుంది.ఇకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టెమెంట్ చేస్తే కనుక తమ అమౌంట్ డబుల్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. కానీ, రిస్క్ కూడా చాలనే ఉంటుంది.
ఈ క్రమంలోనే మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ సలహాలు, సూచనలు తీసుకుని అడుగులు వేయాల్సి ఉంటుంది. లేదంటే మొత్తానికి మొత్తం అమౌంట్ లాస్ అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి అలా చేయకూడదు.షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టే క్రమంలో వివిధ విషయాలపై అంచనా వేసుకుని సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సంగతులు అలా ఉంచితే.. మార్కెట్‌లో షేర్స్ చాలా ఉంటాయి.
Business News : ఇన్వెస్టర్స్ పంట పండింది..
అటువంటి వాటిలో రాబడి బాగా వచ్చే షేర్స్ కూడా చాలానే ఉంటాయి. అందులో ఫ్లోమిక్ గ్లోబల్ లాజిస్టిక్స్ షేర్స్ ఉన్నాయి. ఈ షేర్ తాజాగా ఇన్వెస్టర్ల పంట పండించేసింది. భారీ లాభాన్ని వారికి అర్జించి పెట్టి వారిని సంపన్నులను చేసింది. గత రెండేళ్ల కాలంలో ఈ షేరు ధర భారీగా ఇంక్రీజ్ అయింది.2019 మార్చి నెలలో ఈ షేరు ధర 35 పైసలు మాత్రమే. కానీ, ఇప్పుడు షేరు ధర రూ.143.. అంటే షేరు ధర ఏకంగా 400 రెట్లుకు పైగా పెరిగింది.
ఆ లెక్కన రెండేళ్ల కిందట మీరు ఒక వేళ లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లియితే ఇప్పుడు దాని విలువ ఏకంగా రూ.4 కోట్లకు చేరుతుంది. అంటే మీరు ఒకే ఒక్క లక్ష రూపాయలతో కోటీశ్వరులు అయ్యేవారన్న మాట. ఈ షేరు ధర గత ఆరు నెలల కాలంలో రూ.7.6 నుంచి రూ.143కు చేరింది. అంటే 1,780 శాతం ఇంక్రీజ్ అయింది. అమాంతంగా షేర్ ధర పెరగడం వలన అందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ సంపన్నులయ్యే చాన్సెస్ ఉన్నాయి.