Business Idea : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ ఇదే…!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంతంగా బిజినెస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పెట్టుబడి పెట్టడానికి కొందరు వెనకడుగు వేస్తారు. అలాంటి వారికి ఈ బిజినెస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ బిజినెస్ తో తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభాలను పొందవచ్చు. అలాగే ఇంట్లో కూర్చుని కూడా ఈ బిజినెస్ ను చేయవచ్చు. అలాగే ఆడవారికి కూడా ఇది మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. ఆ బిజినెస్ నే పేపర్ ప్లేట్స్ బిజినెస్. పేపర్ ప్లేట్స్ బిజినెస్ చేయడానికి మిషన్లు అవసరం. ఈ మిషన్స్ లో కూడా వివిధ రకాల మిషన్లు ఉంటాయి.
ఇందులో హైడ్రాలిక్ పేపర్ మిషన్, పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, డోనా పేపర్ ప్లేట్స్ మేకింగ్ మిషన్, మల్టీ ఫంక్షన్ పేపర్ ప్లేట్ మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మిషన్లు ఉన్నాయి. ఏవిఆర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వాళ్ళు కొత్త టెక్నాలజీతో తెచ్చిన ఈ మిషన్ ఒక గంటలో 4వేల పేపర్ ప్లేట్స్ ని తయారు చేస్తుంది. ఈ మిషన్ తో బెస్ట్ క్వాలిటీ పేపర్ ప్లేట్స్ తయారు చేస్తుంది. ఏవిఆర్ మిషన్లతో కేవలం పేపర్ ప్లేట్ లు కాకుండా కప్పులు కూడా తయారు చేస్తుంది. ఈ మిషన్లతో పేపర్ క్వాలిటీగా వస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చేసిన ప్లాస్టిక్ ను బ్యాన్ చేస్తున్నారు పేపర్ ప్లేట్స్ పేపర్ కప్పులను తయారు చేస్తున్నారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది.
రాబోయే రోజుల్లో పేపర్ ప్లేట్స్ కప్పులపై డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మిషన్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేశారంటే మంచి ఆదాయం పొందవచ్చు. ఎవరైనా పేపర్ ప్లేట్స్ బిజినెస్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా కంపెనీకి వెళ్లి ఏవిఆర్ మిషన్లని కొనుగోలు చేసుకోండి. ఈ మిషన్ లు ఎలా పేపర్ ప్లేట్స్ ని తయారు చేస్తాయో డెమో చూసి కొనుగోలు చేయండి. ఏవీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఫుల్ ఆటోమేటిక్ మిషన్లు, మ్యానువల్ మిషన్లు కూడా ఉన్నాయి. ఒక్క మనిషితో ఈ మిషన్లను రన్ చేసుకోవచ్చు. మనిషి లేకుండా కూడా రన్ చేసుకోవచ్చు. పేపర్ ప్లేట్స్ హోల్సేస్ షాప్ పెట్టుకుంటే మంచి ఆదాయం లభిస్తుంది.