Business Idea : ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా.. అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే…!
Business Idea : బిజినెస్ ఐడియాప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఏదో ఒక జాబ్ చేసే బదులు సొంతంగా వ్యాపారం పెట్టుకొని సొంతంగా సంపాదించాలని కొందరు కలలు కంటున్నారు. ఒకరి కింద కష్టపడి పని చేసే బదులు తమె సొంతంగా వ్యాపారం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే అవి మనకే మిగులుతాయి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. కరోనా వచ్చాక చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొంతమందికి పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్న ఏ బిజినెస్ చేయాలో అర్థం కాదు. కొందరు పెట్టుబడి పెట్టలేక ఇంట్లోనే ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికి ఇది మంచి బిజినెస్ అని చెప్పవచ్చు.
మనకు ఈజీగా దొరికే రా మెటీరియల్ తో బిజినెస్ చేయవచ్చు. తాగి పడేసిన కొబ్బరి బొండాల పైన ఉండే పీచును తీసి తాళ్ళను, మ్యాట్స్ ను తయారు చేయవచ్చు. వీటిని తయారు చేయటానికి రా మెటీరియల్ సంవత్సరం అంతా దొరుకుతుంది. చిన్న చిన్న వ్యాపారుల దగ్గర నుంచి ఈ మెటీరియల్ కలెక్ట్ చేసుకోవచ్చు. కొబ్బరి పీచును కేజీలు లెక్క కొనుగోలు చేస్తారు. వీటికి పెద్ద మార్కెట్ నే ఉంది. కొబ్బరి పీచు వాడకం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన ఇండియాలో దీంతో పెద్ద బిజినెస్ నే సాగుతుంది. కాకపోతే ఇది అందరికీ తెలియని బిజినెస్.
కొబ్బరి పీచు ను బెడ్ పరుపులలోకి, సోఫాలోకి, వాహనాల సీట్లు తయారీ కి వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. కాబట్టి దీని వాడకం ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ కి కావాల్సింది కేవలం రా మెటీరియల్ నే. ప్రతిరోజు కొబ్బరిబోండం భారీ ఎత్తున బిజినెస్ సాగుతుంది. మీరు కనుక బిజినెస్ చేయాలనుకుంటే ఈ కొబ్బరి బొండాలను కలెక్ట్ చేసుకోని రోప్ తయారు చేసి బిజినెస్ చేయవచ్చు. రోప్ తయారు చేయడానికి మిషన్ న్ని కొనుగోలు చేసుకోవాలి. మిషన్ కొనుగోలు చేసి చేయాలనుకుంటే స్మార్ట్ ఫోన్లో మిషన్ లు ఎక్కడ ఎక్కడ ఇస్తారో చెక్ చేసుకుని కొనుగోలు చేయాలి. ఈ బిజినెస్ తో మంచి ఆదాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది.