Business Idea : మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని చేయాలి అనుకుంటున్నారా..!
Business Idea : చాలామంది వారు చేసే ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి ఏదో ఒక సొంత వ్యాపారం చేసుకోవాలి .అని అనుకుంటూ ఉంటారు. ఎందుకనగా.. వారు చేసే ప్రభుత్వం ఉద్యోగాలలో కొన్ని ఒత్తిడిలు, తక్కువ శాలరీలు, ఎక్కువ పని చేయించుకోవడం, ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి. అది తక్కువ పెట్టుబడితో దానికి ఎప్పుడు ఎక్కువ డిమాండ్ ఉండాలి. అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి బిజినెస్ ను ఒక్కసారి ట్రై చేయండి.. ఇక దానిని వదలరు.
అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఫోన్లు, లాప్ టాప్ లు, కొన్ని రకాల సిస్టం లు, ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుతూ ఉన్నారు. అయితే అలాంటి వస్తువులు అప్పుడప్పుడు రిపేర్ కి వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో రిపేర్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ మొబైల్స్, ల్యాప్టాప్ లు ఇలా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరింగ్ షాప్ పెట్టుకొని.. ఎంతో లాభాలను పొందవచ్చు. అలాగే ఇంటర్నెట్ చాలా సులువుగా యాక్సెస్ చేయడంతో దేశంలో ఆన్లైన్ సేవలు ఫాస్ట్ గా విస్తరిస్తాయి.
అయితే ఈ బిజినెస్ చేసేటప్పుడు దీని గురించి అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతే, దీనిని ప్రారంభించడం మంచిది. అయితే ఇలాంటి కోర్సులను చేసిన తర్వాతనే ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టండి. దీనికి ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో చాలా డిమాండ్ ఉన్నది. కాబట్టి వీటి కోర్సులు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇలా ఈ కోర్సులు నేర్చుకున్న తర్వాత, తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని పెట్టుకొని ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు.