crude oil : కేంద్రం ఆ పని చేస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయి : ఆర్బీఐ
crude oil : భారత దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీకి దగ్గర పడ్డాయి. కొన్న రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ కొట్టేసింది. ఇలాంటి సమయంలో నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరగడంతో పాటు అన్ని రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులకు బతుకు భారం అవుతున్న ఈ సమయంలో దేశంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చక్కబడాలంటే రేట్లు తగ్గాలంటూ సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. డీజిల్ మరియు పెట్రోల్ రేట్లను తగ్గించడం కేంద్రం మరియు రాష్ట్రాల చేతిలోనే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించవచ్చు అంటూ ఈ సందర్బంగా ఆయన అన్నారు.
crude oil : పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తే రేట్లు తగ్గుతాయి…
మన దేశంలో డీజిల్ పై 56 శాతం, పెట్రోల్ పై 60 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ పన్నులో సగం వరకు కట్ చేస్తే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ రేట్లు 25 నుండి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో అది ఇబ్బందే అయినా కూడా తగ్గించకుంటే ముందు ముందు మరింతగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శక్తికాంత్ అన్నారు. ముందు ముందు ఉత్పత్తి తగ్గడంతో పాటు పెద్ద ఎత్తున లోటు బడ్జెట్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఈ విషయమై కేంద్రం మరియు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచించి పన్ను తగ్గించాలని సలహా ఇచ్చారు. గత కొంత కాలంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినప్పటికి ఇంకా కూడా ఇందనం ధరలు పెరుగుతూనే ఉండటం విచారకరం అంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం లేకుండా ఆయిల్ రేట్లు ఉండాలి…
అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చు తగ్గుల వల్లే డీజిల్ మరియు పెట్రోల్ రేట్లు పెరగడం తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇండియాలో కొనసాగుతోంది. గత పది రోజులుగా కంటిన్యూగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో వందకు దగ్గర్లో పెట్రోల్ రేటు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల వంద అయిన కారణంగా బంక్ లపై దాడులు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి స మయంలో మోడీ ఏదైనా నిర్ణయం తీసుకోకుంటే మాత్రం ఆయనకు వచ్చే సారి ప్రజలు బిగ్ షాక్ ఇవ్వక తప్పదు అంటున్నారు. పెట్రోల్ రేటుతో ముడి పడి సామాన్య జనజీవనం సాగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా పెట్రోల్ రేటు తగ్గాలని కోరుకుంటున్నారు.