Business Idea : పెట్టుబడి చాలా తక్కువ.. ఆదాయం మాత్రం మూడు రెట్లు.. ఈ బిజినెస్ చేస్తే లక్షలు గడించవచ్చు
Business Idea : చాలామంది 9 టు 5 జాబ్ కంటే ఏదైనా బిజినెస్ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి.. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాల్సిన పని లేదు. ఏ పని చేసుకొని అయినా బతకొచ్చు.. డబ్బు సంపాదించవచ్చు. డబ్బు సంపాదన కోసం ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎన్నో బిజినెస్ లు ఉంటాయి. కొన్ని బిజినెస్ ల కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరికొన్ని బిజినెస్ ల కోసం తక్కువ పెట్టుబడి పెడితే చాలు. అందులో ఒకటి పూల బిజినెస్. చాలామందికి వ్యవసాయం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అటువంటి వాళ్లు పూల బిజినెస్ పెట్టుకోవచ్చు. పూల బిజినెస్ అనగానే..
చాలామంది భయపడుతుంటారు కానీ.. పూలను పెంచడం చాలా ఈజీ. మిగితా వ్యవసాయ పనులతో పోల్చితే పూలను పెంచడం చాలా ఈజీ. ఏ శుభకార్యం జరిగినా పూలతో డెకరేషన్ అనేది ఈ రోజుల్లో కామన్. కొన్ని పూలకు ఉండే డిమాండే వేరు. ప్రతి సెలబ్రేషన్ లో పూలు ఉండాల్సిందే. కొన్ని పూల నుంచి సువాసన వస్తుంటుంది. కొన్న ఔషధాలలో కూడా పూలను వాడుతుంటారు. పూల బిజినెస్ చేయాలనుకునేవాళ్లు ముందు ఏర్పాటు చేసుకోవాల్సింది నీటి కొరత లేని భూమి. ఎందుకంటే.. పూలు ఎదగాలంటే నీరు చాలా అవసరం. అందుకే.. నీటి సమస్య లేకపోతే.. వెంటనే పూల పెంపకాన్ని స్టార్ట్ చేయొచ్చు. అలాగే..
Business Idea : పూలకు ఉండే డిమాండే వేరు
వాతావరణానికి అనుగుణంగా పెరిగే పూలను సాగు చేసుకోవాలి. ఒకవేళ నీటి కొరత ఉంటే.. దాని కోసం పాలి హౌస్ లను ఏర్పాటు చేసుకొని పూలను పెంచుకోవచ్చు. ప్రస్తుతం మన దేశంలో రోజ్ మ్యారిగోల్డ్, ట్యూబెరోస్, జాస్మిన్, క్రిసాన్తిమం, ఆస్టర్ బెల్లీ లాంటి పూలకు చాలా డిమాండ్ ఉంది. కొన్ని పూలను కొన్ని వస్తువుల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. మార్కెట్ లో పండించిన వాళ్లే తీసుకెళ్లి డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. దాని వల్ల.. ఎక్కువ లాభాలను గడించవచ్చు. ఒక ఎకరం భూమిలో పూలను పెంచాలంటే.. పెట్టుబడి ఒక 10 వేల వరకు అవుతుంది. పూలు పెరగడం ప్రారంభించాక.. ఒకసారి సాగు ద్వారా కనీసం రూ.75 వేల వరకు సంపాదించవచ్చు.