Business Idea : సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా.? అయితే ఈ ఐడియాలతో ట్రై చేయండి…!
Business Idea : చాలామంది చదువుకొని జాబ్ లు లేక ఖాళీగా ఉంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్క టైంలో సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇప్పుడు కొన్ని ఐడియాలతో బెస్ట్ బిజినెస్ అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… ఇప్పుడు శుభ్రమైన కెమికల్స్ లేని మందులు వలన పండే పంటలు పట్ల ప్రజల చూపు బాగా పడుతుంది. కెమికల్స్ వాడని ఆహారాలని తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పంట సాగు చేసే టైంలో కెమికల్స్ మందులను వినియోగించకుండా సేంద్రియ ఎరువులు వేసి పంటను సాగు చేస్తే ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో దానిని మనం వ్యాపారంగా కూడా చేసుకోవచ్చు. సహజంగా అరటి కాండం పనికిరానిదిగా దానిని పడేస్తూ ఉంటారు.
అయితే ఈ అరటి కాండం మీ బిజినెస్ కి ఒక ఆదాయం వనరుగా మారితే మాత్రం మంచి ధనం పొందవచ్చు. రైతులు అరటి పంట పండించే రైతులు సహజంగా దాని కాండాన్ని పడేస్తూ దీని పర్యావరణం మరియు నెల రెండిటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక దాంతో నేల సారం తగ్గిపోతుంది. అయితే ఈ కాండంను సేంద్రియ ఎరువుగా మార్పిడి చేయడం వలన చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ కెమికల్ లేని కంపోస్ట్ ని ఎలా తయారు చేయాలి… అన్నిట్లో ఫస్ట్ ది మీరు గొయ్యిని తీయాలి. అందులో ఆవు పేడ, అరటి కాండం, కలుపు మొక్కలు కాండంతో పాటు ఈ గొయ్యిలో వెయ్యాలి. దీంతోపాటు డీకంపోస్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ కాండం మరియు ఇతర పదార్థం సేంద్రియ ఎరువుగా కుళ్ళుతూ ఉంటుంది. దీనిని రైతులు వారి పంట చేలలోవేసి మంచి పంట సాగు చేయడానికి వినియోగించవచ్చు.
మనం దీనిని మార్కెట్లోకి తీసుకెళ్లడం వలన కొనుగోలు చేయవచ్చు. బారి లాభాన్ని కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కెమికల్ ఎరువుల స్థానంలో సేంద్రీయ ఎరువులను ఉపయోగాన్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సేంద్రియ ఎరువు తయారీకి పెద్దగా ధనం కూడా ఖర్చు అవ్వదు. దానివలన దీని నుండి సంపాదన అలాగే నికర లాభం సుమారు ఒకే విధంగా ఉంటాయి. ఈ కెమికల్ లేని ఎరువులు పై ప్రభుత్వం ఒక అవగాహన ఇస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ ఎరువు వినియోగించేలా ప్రజల్ని సపోర్ట్ చేస్తున్నాయి. దాని లక్షణాలపై రైతులకు ఒక అవగాహన కలిగేలా చేస్తున్నారు. దానికి సంబంధించి రైతులకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువుని వినియోగించడం వలన భూమి యొక్క సారవంతమైన శక్తిని కోల్పోకుండా రసాయన రహిత కూరగాయలు మరియు ధాన్యాలు, పొందడం వల్ల ప్రజలు ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది.