Business Idea : 50వేల పెట్టుబడితో మూడు నెలల్లో 30 లక్షల ఆదాయాన్ని ఇచ్చే బిజినెస్ ఇదే…
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందాలనుకుంటారు. అయితే ఇటీవల బ్లాక్ చికెన్ ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందింది. దీని వ్యాపారం చాలావరకు, మధ్యప్రదేశ్ చతిస్ ఘడ్ ప్రాంతాలలో జరుగుతుంది. అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ఈ వ్యాపారం విస్తరిస్తుంది. కడకనాథ్ కోడి మాంసం శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించడంలో, బ్లడ్ షుగర్ నియంత్రించడంలో, కండరాల బలాన్ని పెంచడంలో మరియు క్యాన్సర్ ను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాగే కడక్నాథ్ చికెన్ కు ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఈ చికెన్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. అందువలనే దీనికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ చికెన్ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది.
కడకనాథ్ చికెన్ వ్యాపారం చేయడం ద్వారా స్థానికులకు కొత్త టేస్ట్ అందించడంతోపాటు భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. మధ్యప్రదేశ్, చతిస్గడ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో కడకనాథ్ చికెన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. మధ్యప్రదేశ్ కు కడకనాథ్ చికెన్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఈ కోడి మాంసంలో అత్యధికంగా ఐరన్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయి. దీనివలన గుండె మరియు డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ కడకనాథ్ మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కడకనాథ్ మాంసం వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రభుత్వ సహాయం చేస్తుంది. మధ్యప్రదేశ్ చతిస్ ఘడ్లలో చికెన్ వ్యాపారం కోసం అనేక పథకాలు అమలు చేయబడుతున్నాయి.
చతిస్ ఘడ్ లో కేవలం 53000 జమ చేస్తే మూడు విడతలుగా 1000 కోళ్లు, 30 కోళ్ల షెడ్లు, 6 నెలల పాటు ఉచితంగా కోళ్ల దాణాలు ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాకుండా టీకాలు వేయడం మరియు ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కోళ్లు పెద్దయ్యాక ప్రభుత్వమే మార్కెటింగ్ పనులు చేస్తుంది. కోళ్ల పెంపకం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. కడకనాథ్ కోళ్ల పెంపకం కోసం కృషి విజ్ఞాన కేంద్రం నుండి చిన్న కోళ్లను తీసుకోవచ్చు. నిపుణుల సలహా మేరకు దాణా వేసి వాటిని పెంచాలి. మూడున్నర నాలుగు నెలల్లో కడకనాథ్ కోళ్లు అమ్మకానికి వస్తాయి. ఈ చికెన్ మాంసం ధర కేజి 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు. చలికాలంలో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మాంసం ధర ₹1000 నుంచి 1200 రూపాయల వరకు ఉంటుంది. ప్రభుత్వం నుండి 53 వేల రూపాయలకు వేయి కోళ్లను కొన్నారంటే ఒక కోడి నుండి నెలకు సగటున మూడు కేజీలకు పెరుగుతుంది. ఈ లెక్కన చలికాలంలో ఈ వ్యాపారం చేయడం ద్వారా ఖర్చులు పోను 30 లక్షల రూపాయలు పైగా సంపాదించవచ్చు.