Loan : ఆ స్కీమ్‌లో అప్పుడే మొదలైన సమస్యలు.. పాత లోన్ రాదు, కొత్త లోన్‌కి ఇబ్బందులు
ప్రధానాంశాలు:
Loan : ఆ స్కీమ్‌లో అప్పుడే మొదలైన సమస్యలు.. పాత లోన్ రాదు, కొత్త లోన్‌కి ఇబ్బందులు
Loan : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతి, యువకులకు స్వయం ఉపాధి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఇందులో సగానికిపైగా సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం స్కీమ్ రూపకల్పన చేసింది.

Loan : ఆ స్కీమ్‌లో అప్పుడే మొదలైన సమస్యలు.. పాత లోన్ రాదు, కొత్త లోన్‌కి ఇబ్బందులు
Loan ఇవే సమస్యలు..
అయితే అసలు ఈ రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎవరు అర్హులు..? ప్రభుత్వం ఏ వ్యాపారం పెట్టుకుంటే నగదు ప్రోత్సాహకం అందిస్తుంది..? దరఖాస్తు చేసుకునే వారికి ఏ ధ్రువపత్రాలు ఉండాలి..? అనే దానిపై కూడా గైడ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధుల్ని సమకూర్చనుంది. ఇంటికి ఒకరికి మాత్రమే ఈ పథకం కింద ప్రభుత్వం రూ.4 లక్షల రూపాయలు అందించనుంది. ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వం క్యాటగిరీల వారీగా 60 నుంచి 80 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పాత రికార్డుల సమస్య అలానే యువజన్ వికాస్ పథకానికి మీ సేవా కేంద్రాలలో నిరుద్యోగులు అప్లై చేసుకునే క్రమంలో ఒబీఎంఎస్ పోర్టల్‌లో ఈ ఆధార్ ఇప్పటికే ఉంది అనే సందేశం కనిపిస్తుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇప్పటికే ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయిందని, కొత్తగా రిజిస్టర్ చేయలేరని సందేశం కనిపిస్తుంది