రోజు రూ.100 పెడితే నెలకు 30వేలు మిగులుతాయి .. ఇంతకంటే బెస్ట్ బిజినెస్ మరొకటి ఉండదు..!

Advertisement

ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగం చేస్తూ ఒకరి కింద పని చేసే బదులు తామె సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి కాస్త కష్టపడితే డబ్బులు మనకే మిగులుతాయి కదా అని ఆలోచిస్తున్నారు. అయితే కొందరికి ఏ బిజినెస్ చేయాలో అర్థం కాదు, మరికొందరికి పెట్టుబడి పెట్టే స్తోమత లేక సొంత వ్యాపారం చేయడానికి వెనకడుగు వేస్తారు. అలాంటివారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. చాలా తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. అదే బంగాళదుంప చిప్స్ వ్యాపారం. ప్రస్తుత కాలంలో చిరుతిండ్లకు బాగా డిమాండ్ ఉంది. కాబట్టి ఈ బిజినెస్ ను క్యాచ్ చేసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.

Advertisement

బంగాళదుంప చిప్స్ తయారు చేయడానికి మిషన్ అవసరం. దానికి రూ.850 ఖర్చు అవుతుంది. ఈ మిషన్ ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే ముడి పదార్థాలపై కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. బిజినెస్ స్టార్టింగ్ లో 100 నుంచి 200 వరకు ధరలోని ముడి సరుకులను కొనుగోలు చేయాలి. చిప్స్ తయారు చేసే మిషన్ ఏదైనా టేబుల్ పై ఉంచడం ద్వారా చిప్స్ లను సులభంగా కత్తిరించవచ్చు. ఈ మిషన్ కు ఎక్కువ ప్లేస్ కూడా అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ మిషన్ పనిచేయటానికి కరెంటుతో అస్సలు పని ఉండదు.

Advertisement
low invest get best income
low invest get best income

ప్రస్తుతం జనాలు శుభ్రతను పాటిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ చిప్స్ లను అందిస్తే మీ వ్యాపారానికి డిమాండ్ పెరుగుతుంది. చిప్స్ లను మంచి క్వాలిటీ, రుచితో తయారు చేస్తే కస్టమర్స్ పెరిగి మీకు అధిక లాభాలు వస్తాయి. ఈ వ్యాపారం ఇంటి ముందు చిన్న బండి మీద కూడా స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే దుకాణదారులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. బంగాళదుంప చిప్స్ ఆదాయం ఖర్చు కంటే ఏడు రెట్లు ఎక్కువ వస్తుంది. రోజు 10 కిలోల బంగాళాదుంప చిప్స్ అమ్మితే రూ.1000 సంపాదించవచ్చు. ఇలా నెలకు 30 వేల దాకా సంపాదించవచ్చు. మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి సోషల్ మీడియాను ఉపయోగించి మీ బిజినెస్ గురించి ఎక్కువమందికి చేరేలా చేయండి. దీంతో మీ వ్యాపారం పాపులర్ అయి మంచి లాభాలు వస్తాయి.

Advertisement
Advertisement