Business : బంగారం లాంటి బిజినెస్.. లక్షల్లో ఆదాయం..!
Business : బంగారం ధర రోజురోజుకు ఆకాశాన్ని తాకుతుంది. దాంతో బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వైపు మహిళలు మళ్లుతున్నారు. మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ఎక్కువగా ధరిస్తున్నారు. వినియోగం క్రమంగా పెరుగుతుండడంతో ఈ వ్యాపారం పైపైకి ఎగబాకుతుంది. తక్కువ ఖర్చుతో, కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్. ఉంగరం.. చేతికి […]
ప్రధానాంశాలు:
Business : బంగారం లాంటి బిజినెస్.. లక్షల్లో ఆదాయం..!
Business : బంగారం ధర రోజురోజుకు ఆకాశాన్ని తాకుతుంది. దాంతో బంగారాన్ని తలదన్నే రీతిలో రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్ నగల వైపు మహిళలు మళ్లుతున్నారు. మహిళలు ఇటీవల కాలంలో ఫంక్షన్లలో రోల్డ్ గోల్డ్ ఆభరణాలనే ఎక్కువగా ధరిస్తున్నారు. వినియోగం క్రమంగా పెరుగుతుండడంతో ఈ వ్యాపారం పైపైకి ఎగబాకుతుంది. తక్కువ ఖర్చుతో, కోరుకున్న డిజైన్లలో ఈ నగలు లభిస్తుండడంతో మహిళలు వీటిని ధరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వజ్రాలు, రత్నాల్లాంటి రాళ్లు పొదిగిన నెక్లెస్. ఉంగరం.. చేతికి గాజులు…నగిషీలతో తీర్చిదిద్దిన జూకాలు… విభిన్న ఆకృతుల్లో వడ్డాణాలు…తలపై మెరిసే పాపట బొట్టు.. మెడలో హారం. ఇలా రకాలు. బంగారు ఆభరణాలు. అధునాతన డిజైన్లలో ఆభరణాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
అంతే కాదు కారు చౌకగా ఈ నగలు దొరుకుతున్నాయి. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా ? ప్రస్తుతం తులం బంగారం ధర ఏకంగా రూ. 73 వేలకు చేరుకుంది. భవిష్యత్‌లో రూ. లక్షకు చేరడం ఖాయం. ఈ నేపథ్యంలోనే చాలా మంది రోల్డ్ గోల్డ్‌ను ఉపయోగిస్తున్నారు. అచ్చంగా బంగారు నగలను పోలి ఉండే గిల్టీ నగలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు ఆర్జించవ్చు.
ఇందులో రెండు రకాల వ్యాపారాలు చేయొచ్చు. ఒకటి హోల్‌సేల్‌గా గిల్ట్ నగలను పెద్ద పెద్ద దుకాణాల్లో కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించవచ్చు. లేదంటే నేరుగా దుకాణాలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అదే విధంగా మీరే స్వయంగా గిల్ట్ నగలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో మేకింగ్ మిషిన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు ముందుగా రాగితో తయారు చేసిన ఆభరణాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం వీటిపై గోల్డ్ ప్లేటింగ్ వేయాల్సి ఉంటుంది. వీటికి అవసరమయ్యే మిషనరీలతో పాటు శిక్షణ ఇచ్చే సంస్థలు మార్కెట్లో ఉన్నాయి.