Business Ideas : సాధారణంగా బయటికెళ్లినప్పుడు టీ, కాఫీ తాగితే.. తాగిన కప్పును చెత్తకుప్పలో పడేస్తాం. అది ప్లాస్టీక్ కప్పు లేకపోతే పేపర్ తో చేసిన కప్పు అయి ఉంటుంది. కానీ.. మనం కాఫీ, టీలు తాగేసి.. ఆ కప్పును కూడా ఏంచక్కా తినేస్తే ఎలా ఉంటుంది. ఇదేదో బాగుంది కానీ.. ప్లాస్టిక్, పేపర్ కప్పులను తినలేం కదా అంటారా? అందుకే ఏపీకి చెందిన ఓ మహిళా టీచర్ ఏకంగా ఎడిబుల్ కప్స్ ను తయారు చేస్తోంది. అంటే ఆ కప్పులను నిరభ్యంతరంగా తినేయొచ్చు. అవి తింటుంటే చాలా టేస్టీగానూ ఉంటాయి. దానికి కారణం.. వాటిని బియ్యం, రాగి పిండితో తయారు చేయడం. ఏపీలోని వైజాగ్ జిల్లాలో రేసపువనిపాలెం అనే గ్రామంలో
జయలక్ష్మికి చెందిన ఒక చిన్న కప్పులు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కప్పులు తయారు చేసి సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తోంది ఆ మహిళ. లాక్ డౌన్ ముందు వరకు టీచర్ గా ఉన్న జయలక్ష్మి, లాక్ డౌన్ తో ఇలా ఎంట్రీప్రెన్యూర్ గా మారింది. ముందు కప్పుల బిజినెస్ పెడుదామని అనుకున్నా.. మార్కెట్ లో దొరికే కప్పులకంటే మంచి కప్పులు.. ఆరోగ్యానికి అనుకూలమైన కప్పులు తయారు చేయాలని అనుకుంది జయలక్ష్మి. దాని కోసం.. దాదాపు రెండు నెలలు కష్టపడి మంచి ఫార్ములాను తయారు చేసి ఇప్పుడు ఎడిబుల్ టీ కప్పులను తయారు చేస్తోంది. యూట్యూబ్ లో చూసి ఎలా ఎడిబుల్ కప్స్ ను తయారు చేయాలో నేర్చుకుంది జయలక్ష్మి.
అయితే.. బిజినెస్ ప్రారంభించగానే.. ఒకసారి ఫార్ములా తప్పు అవడం వల్ రూ. లక్ష లాస్ అయ్యానని చెప్పుకొచ్చింది జయలక్ష్మి. రెండు నెలలు రీసెర్చ్ చేశాక.. రాగి, బియ్యం పిండి కలిపి తయారు చేస్తే కప్పులు బాగా వస్తాయని తెలుసుకున్నారు జయలక్ష్మి. బెంగళూరు, హైదరాబాద్ నుంచి కప్పులు తయారు చేసే మిషనరీని తీసుకొచ్చి ఫిబ్రవరి 2021 లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించింది జయలక్ష్మి. తనకు ఇప్పుడు ఏపీతో పాటు ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కస్టమర్లు ఉన్నారు. ఈ రాష్ట్రాలకు తను తయారు చేసిన కప్పులను ఎగుమతి చేస్తూ లక్షలు సంపాదిస్తోంది జయలక్ష్మి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.