Business Ideas : బియ్యం, రాగి పిండితో టీ కప్పులు తయారు చేస్తూ ఏడాదికి 10 లక్షలు సంపాదిస్తున్న ఆంధ్రా టీచర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Ideas : బియ్యం, రాగి పిండితో టీ కప్పులు తయారు చేస్తూ ఏడాదికి 10 లక్షలు సంపాదిస్తున్న ఆంధ్రా టీచర్

 Authored By kranthi | The Telugu News | Updated on :30 January 2023,11:40 am

Business Ideas : సాధారణంగా బయటికెళ్లినప్పుడు టీ, కాఫీ తాగితే.. తాగిన కప్పును చెత్తకుప్పలో పడేస్తాం. అది ప్లాస్టీక్ కప్పు లేకపోతే పేపర్ తో చేసిన కప్పు అయి ఉంటుంది. కానీ.. మనం కాఫీ, టీలు తాగేసి.. ఆ కప్పును కూడా ఏంచక్కా తినేస్తే ఎలా ఉంటుంది. ఇదేదో బాగుంది కానీ.. ప్లాస్టిక్, పేపర్ కప్పులను తినలేం కదా అంటారా? అందుకే ఏపీకి చెందిన ఓ మహిళా టీచర్ ఏకంగా ఎడిబుల్ కప్స్ ను తయారు చేస్తోంది. అంటే ఆ కప్పులను నిరభ్యంతరంగా తినేయొచ్చు. అవి తింటుంటే చాలా టేస్టీగానూ ఉంటాయి. దానికి కారణం.. వాటిని బియ్యం, రాగి పిండితో తయారు చేయడం. ఏపీలోని వైజాగ్ జిల్లాలో రేసపువనిపాలెం అనే గ్రామంలో

These edible cups are made using ragi and rice flour

జయలక్ష్మికి చెందిన ఒక చిన్న కప్పులు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కప్పులు తయారు చేసి సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తోంది ఆ మహిళ. లాక్ డౌన్ ముందు వరకు టీచర్ గా ఉన్న జయలక్ష్మి, లాక్ డౌన్ తో ఇలా ఎంట్రీప్రెన్యూర్ గా మారింది. ముందు కప్పుల బిజినెస్ పెడుదామని అనుకున్నా.. మార్కెట్ లో దొరికే కప్పులకంటే మంచి కప్పులు.. ఆరోగ్యానికి అనుకూలమైన కప్పులు తయారు చేయాలని అనుకుంది జయలక్ష్మి. దాని కోసం.. దాదాపు రెండు నెలలు కష్టపడి మంచి ఫార్ములాను తయారు చేసి ఇప్పుడు ఎడిబుల్ టీ కప్పులను తయారు చేస్తోంది. యూట్యూబ్ లో చూసి ఎలా ఎడిబుల్ కప్స్ ను తయారు చేయాలో నేర్చుకుంది జయలక్ష్మి.

teacher earns 10 lakhs per annum by making edible cups in andhra pradesh

teacher earns 10 lakhs per annum by making edible cups in andhra pradesh

Business Ideas : నెలకు 30 వేల నుంచి 40 వేల కప్పుల తయారు

అయితే.. బిజినెస్ ప్రారంభించగానే.. ఒకసారి ఫార్ములా తప్పు అవడం వల్ రూ. లక్ష లాస్ అయ్యానని చెప్పుకొచ్చింది జయలక్ష్మి. రెండు నెలలు రీసెర్చ్ చేశాక.. రాగి, బియ్యం పిండి కలిపి తయారు చేస్తే కప్పులు బాగా వస్తాయని తెలుసుకున్నారు జయలక్ష్మి. బెంగళూరు, హైదరాబాద్ నుంచి కప్పులు తయారు చేసే మిషనరీని తీసుకొచ్చి ఫిబ్రవరి 2021 లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ను ప్రారంభించింది జయలక్ష్మి. తనకు ఇప్పుడు ఏపీతో పాటు ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కస్టమర్లు ఉన్నారు. ఈ రాష్ట్రాలకు తను తయారు చేసిన కప్పులను ఎగుమతి చేస్తూ లక్షలు సంపాదిస్తోంది జయలక్ష్మి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది