Business Idea : చదువుతో పనిలేని బిజినెస్ .. నెలకు లక్షల్లో ఆదాయం ..!!
Business Idea : ప్రస్తుతం చాలా మంది సొంత వ్యాపారం చేయాలని కలలు కంటున్నారు. అలాంటి వారికి చదువుతో పని లేకుండా ఈ బిజినెస్ చేయవచ్చు. అదే టెంట్ హౌస్ బిజినెస్. ఇవాళ రేపు హడావిడి లేకుండా ఏ ఫంక్షన్ చేయడం లేదు. పిల్లల పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, మెచ్యూర్ ఫంక్షన్లు ఇలా ఒక్కటేమిటి పుట్టినప్పటినుంచి చచ్చే వరకు చచ్చిన తర్వాత కూడా ఫంక్షలు చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కి కావాల్సిన టెంట్ సామాన్లను టెంట్ హౌస్ నుంచి రెంట్ కి తెచ్చుకుంటున్నారు. మీరు కనుక ఈ బిజినెస్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ముందుగా టెంట్ హౌస్ ప్రారంభించాలంటే అందుకు సంబంధించిన వస్తువులు కావాలి. టెంట్ నిలబెట్టడానికి చెక్క లేదా వెదురు కర్రలు, ఇనుప పైపులు, కూర్చోవడానికి కుర్చీలు, వధూవరులకు కుర్చీలు,
కార్పెట్, లైట్లు, ఫ్యాన్లు ఇలా చాలా అవసరం అవుతాయి.ఇక వీటితోపాటు భోజనాల కోసం భోజనం టేబుల్స్, వండటానికి వంట సామాన్లు, గిన్నెలు, ముంతలు, గరిటలు, సాంబార్ బకెట్లు , మంచినీటి డ్రమ్ములు , గ్యాస్ స్టవ్ ఇలా కొన్ని సామాన్లు అవసరమవుతాయి. ఈ బిజినెస్ రిచ్ గా ప్రారంభించాలంటే ఐదు లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే అంత పెట్టుబడి పెట్టలేక పోతే లక్ష రూపాయలతో కూడా ప్రారంభించవచ్చు. లక్ష పెట్టుబడితో టెంట్ హౌస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెలకు పాతికవేల నుంచి 30 వేల వరకు సంపాదించవచ్చు. పెళ్లిళ్ల సీజనైతే నెలకు లక్షల ఆదాయం వస్తుంది. ఇక ఈ బిజినెస్ లో నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
వ్యాపారానికి పెద్దగా ప్లేస్ అవసరం లేదు. సామాన్లకు 10 చదరపు అడుగుల గది అయితే సరిపోతుంది. గ్రామంలో , చిన్నచిన్న పట్టణాలలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారం చేస్తూ వేరే పని కూడా చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదు. కస్టమర్ వచ్చినప్పుడు సామాన్లు లిస్టు రాసుకొని ఇస్తే చాలు. రోజుకి ఇంత రెంట్ అని ఉంటుంది తిరిగి తెచ్చిన రోజున మీ సామాన్లు అన్ని సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే చాలు. ఈ వ్యాపారంలో ఇంకా సంపాదించుకోవాలి అనుకుంటే భోజనాలు అయిపోయాక వంట సామాన్లు కడిగే వారిని ప్రొవైడ్ చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చు. వంటవారిని వడ్డించే వారిని కూడా పంపిస్తే అదనంగా ఆదాయం వస్తుంది.