Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!
ప్రధానాంశాలు:
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!
Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది ఒక ముఖ్యమైన కాలం అయినప్పటికీ, గోల్డ్ రేట్లు మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో 22 క్యారట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 89,460 కాగా, 24 క్యారట్ల ధర రూ. 97,590గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ధరల్లో రూ.10 పెరిగినట్టు గమనించవచ్చు.

Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!
Today Gold Price : తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు పెరుగడానికి అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కీలక అంశాలు కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు బాగా తెగిపోయిన నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం చైనా ఉత్పత్తులపై భారీ ప్రతీకార సుంకాలను విధించింది. దీని ప్రభావంతో స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగి నష్టాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారంపై పెట్టడం ప్రారంభించారు. దీంతో గోల్డ్ డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
ఇటు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కావడం, అటు అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల మొగ్గు బంగారంపై పెరగడంతో ధరలు అదుపు తప్పుతున్నాయి. ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేసేందుకు ముందు కొన్ని సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పసిడి అంటే భారతీయులకో ప్రత్యేకమైన అనుబంధం. శుభకార్యాల్లో, వివాహాల్లో బంగారం కొనుగోలు ఒక సంప్రదాయంగా మారిపోయింది. అందుకే ధరలు ఎంత పెరిగినా, కొంతమంది వినియోగదారులు కొనుగోలుకు ముందుకొస్తున్నారు.