Today Gold Price : ఏ ఏ సిటీ లో బంగారం ధర ఏ రేంజ్ లో ఉందంటే !!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 19 June 2025, 11:00 am
  •  నేటి బంగారం, వెండి ధరలిలా..!

  •  Today Gold Price : ఏ ఏ సిటీ లో బంగారం ధర ఏ రేంజ్ లో ఉందంటే !!

Today Gold Price : ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.170 పెరిగి రూ.1,01,080కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.92,650కి చేరింది. వెండి కూడా రూ.1,000 పెరిగి కేజీకి రూ.1,22,000 పలుకుతోంది.

Today Gold Price : ఏ ఏ సిటీ లో బంగారం ధర ఏ రేంజ్ లో ఉందంటే !!

Today Gold Price : ఏ ఏ సిటీ లో బంగారం ధర ఏ రేంజ్ లో ఉందంటే !!

Today Gold Price : పసిడి పరుగులు .. ఈరోజు ఎంత పెరిగిందంటే !!

దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయని చూడొచ్చు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,070 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.92,660 ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, విజయవాడ, కోల్‌కతా, కేరళ తదితర నగరాల్లో 24 క్యారెట్ల ధరలు సుమారు రూ.1,00,920 కాగా, 22 క్యారెట్ల ధరలు రూ.92,500 చుట్టూ ఉన్నాయి. ఇది బంగారం ధరలు దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయని సూచిస్తుంది.

వెండి ధరల విషయంలోనూ కొన్ని నగరాల్లో పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, కేరళలో వెండి ధరలు కేజీకి రూ.1,21,100గా ఉన్నాయి. అయితే ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కేజీ వెండి ధరలు రూ.1,11,100గా ఉన్నాయి. దీనివల్ల దక్షిణ భారతంలో వెండి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ధరల పెరుగుదల మరింత కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp