Today Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండి
ప్రధానాంశాలు:
Today Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండి
Today Gold Rate : ఈ రోజు జూన్ 2 (సోమవారం) నాడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుToday Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండితున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,343గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,233గా నమోదైంది. మరోవైపు, వెండి ధర కూడా స్వల్ప మార్పులతో రూ.97,280కి చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కొంత స్థిరత కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశంపై మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది.

Today Gold Rate : ఈ రోజు బంగారం ధర పెరిగిందా.. ? తగ్గిందా..? మీరే చూడండి
Today Gold Rate : జూన్ 2 న బంగారం ధర ఎలా ఉందంటే..!
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే, సంస్థలకు డబ్బుల ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేయగలవు. ఇదే సమయంలో బంగారం వంటి భద్రత కలిగిన పెట్టుబడి ప్రత్యామ్నాయాలపై డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. గత నెలల్లో బంగారం ధర 1 లక్ష రూపాయల మార్కును చేరుకున్నప్పటికీ, కొన్ని రోజుల్లోనే 95 వేల రూపాయల దాకా పడిపోయింది. అయినప్పటికీ, ప్రస్తుతం ధరలు మళ్లీ పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
అంతర్జాతీయంగా ఒక ఔన్స్ బంగారం ధర గతంలో 3,500 డాలర్లను దాటినప్పటికీ, ప్రస్తుతం అది 3,330 డాలర్ల దిగువకు పడిపోయింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి 3,000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయదలచుకున్న వినియోగదారులు ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నదని ఎదురుచూస్తున్నారు.