Children : పిల్లలు సంపాదించే ఆదాయానికి ఎవరు పన్ను కట్టాలి… దీనికున్న నిబంధనలు ఏమిటి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Children : పిల్లలు సంపాదించే ఆదాయానికి ఎవరు పన్ను కట్టాలి… దీనికున్న నిబంధనలు ఏమిటి…!

Children : ప్రస్తుతం ఇది సోషల్ మీడియా యుగం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే. చాలా మంది కంటెంట్ సృష్టికర్తలు మరియు రియల్ స్టార్ లు మరియు ప్రభావశీలులుగా మారారు కాబట్టి. అయితే చిన్నపిల్లలు కూడా తమ ప్రతిబను చూపిస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నారు. అయితే వారి ఆదాయం అనేది పరిధిలోకి వచ్చినట్లయితే దానికి ఎవరు పన్ను కట్టాలి. దీని గురించి చట్టం ఏమి చెబుతుంది. ఈ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.  పిల్లలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :9 July 2024,12:00 pm

Children : ప్రస్తుతం ఇది సోషల్ మీడియా యుగం అని చెప్పొచ్చు. ఎందుకు అంటే. చాలా మంది కంటెంట్ సృష్టికర్తలు మరియు రియల్ స్టార్ లు మరియు ప్రభావశీలులుగా మారారు కాబట్టి. అయితే చిన్నపిల్లలు కూడా తమ ప్రతిబను చూపిస్తూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉన్నారు. అయితే వారి ఆదాయం అనేది పరిధిలోకి వచ్చినట్లయితే దానికి ఎవరు పన్ను కట్టాలి. దీని గురించి చట్టం ఏమి చెబుతుంది. ఈ వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.  పిల్లలు రెండు రకాలుగా సంపాదించవచ్చు. ఒకటి వాళ్లు సంపాదించిన ఆదాయం. మరొకటి ఆస్తి సంపాదన. అయితే ఆస్తి మరియు భూమి మరియు ఆస్తి బహుమతి ఇలా తల్లిదండ్రులు పిల్లల పేర్ల మీద పెట్టుబడి పెడితే దానిపై వచ్చే వడ్డీ అనేది ఆదాయంగా వస్తూ ఉంటుంది.

అయితే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 64 (1A) ప్రకారం చూసినట్లయితే, మైనర్ అయిన పిల్లలు గనక సంపాదిస్తే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఆదాయం అనేది వాళ్ల తల్లిదండ్రుల ఆదాయానికి కలపటం జరుగుతుంది. అయితే ఈ ఆదాయాన్ని బట్టి వారు పన్ను కట్టాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 10( 32 )ప్రకారం చూసినట్లయితే, అయితే సంవత్సరానికి రూ.1500 వరకు పిల్లల ఆదాయం అనేది పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే రూల్ 64 (1A) ప్రకారం చూసినట్లయితే, పిల్లలకు వచ్చే ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయానికి కలుపుతారు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా సంపాదకులు అయినట్లయితే వారి పిల్లలు మరియు తల్లిదండ్రుల అధిక ఆదాయం అనేది నిబంధనల ప్రకారం పన్ను విధించడం జరుగుతుంది. అంతేకాక పిల్లలు గనక లాటరీ గెలిచినట్లయితే 30% టీడీఎస్ తీసివేస్తారు. అలాగే దానిపై 10% సర్ చార్జ్, 4% వరకు సెస్ కట్టాల్సి ఉంటుంది.

Children పిల్లలు సంపాదించే ఆదాయానికి ఎవరు పన్ను కట్టాలి దీనికున్న నిబంధనలు ఏమిటి

Children : పిల్లలు సంపాదించే ఆదాయానికి ఎవరు పన్ను కట్టాలి… దీనికున్న నిబంధనలు ఏమిటి…!

కానీ కొడుకు గనక అనాధ అయితే మాత్రం తన సంపాదనపై స్వయంగా ఐటీఆర్ కట్టాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 80(U) ప్రకారం చూస్తే, పిల్లవాడు వికలాంగుడు మరియు అతని వైకల్యం 40% కంటే అధికంగా ఉన్నట్లయితే అతని ఆదాయం తల్లిదండ్రుల ఆదాయానికి కలపటం జరగదు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది