Children : పిల్లల చేత దొంగతనం మానిపించాలంటే… ఇలా చెయ్యండి…!
Children : సాధారణంగా పిల్లలు చిన్నతనంలో ఏదో ఒక వస్తువులను దొంగలించటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు చిన్నతనంలో దొంగతనాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ అలవాటు అనేది అలానే పెరిగితే వీళ్ళు పెద్దయ్యేసరికి ఆ సమస్యలు కూడా పెద్దగా మారతాయి. ఇలా జరగకుండా ఉండాలి అంటే.చిన్నతనంలోనే వారిలో ఉన్న ఈ అలవాట్లను వీలైనంత తొందరగా మాన్పించాలి. దీని కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
Children ఓపిక అవసరం
పిల్లల గనుక మీ ముందు దొంగతనం చేసినట్లుగా కనిపిస్తే వెంటనే కోప్పడడం, కొట్టటం లాంటివి అసలు చేయకూడదు. మీరు కొద్దిసేపు చాలా ప్రశాంతంగా ఉండాలి. దాని తర్వాత వారిని దగ్గరికి తీసుకోని దొంగతనం చేయటం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పాలి. ఇలా చేయటం వలన ఫ్యూచర్ లో ఎన్నో సమస్యలు వస్తాయి అని వారికి తెలియజేయాలి. ఉదాహరణకు దొంగతనం చేస్తే జైలుకు పంపిస్తారని, అక్కడ ఎన్నో బాధలు పెడతారు అని చెప్పాలి. ఇలా చేయడం వలన వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది…
క్షమించడం : దొంగతనం చేసే అలవాటు చాలా పెద్ద తప్పు అయినప్పటికీ వారు అలా చేసినప్పుడు మీరు చూస్తే వెంటనే కోప్పడడం మానేసి క్షమించడం నేర్చుకోవాలి. తర్వాత వారిని దగ్గరికి తీసుకొని కౌగిలించుకోవాలి. అలాగే వారితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి. ఇలా చేయటం వలన వారి చేత దొంగతనం చేయకుండా మాన్పించవచ్చు అని గుర్తుంచుకోవాలి…
టైం స్పెండ్ చేయడం : మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయాలి. ఇలా చేయటం వలన మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది మీ బిడ్డని ఎంతో ప్రేమించేలా చేస్తుంది. అప్పుడు వారు కూడా మీతో క్లోజ్ గా ఉంటారు. అలాగే వారి ఆలోచనలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు..
మీరే దాచి పెట్టండి : పిల్లలు డబ్బుతీయడం మరియు ఇతర వస్తువులు కూడా ఏం తీస్తున్నారో తెలుసుకొని అవి కనిపించకుండా మీరే జాగ్రత్తగా దాచి పెట్టాలి. ఇలా చేయటం వలన వారే కొద్ది రోజుల పాటు అలా చూసి చూసి ఏమీ కనిపించకపోయేసరికి సాధారణంగా ఉండేందుకు అలవాటు పడతారు.అంతేకానీ మీరే వారి చేతకి తాళాలు అసలు ఇవ్వద్దు..
ఒప్పుకుంటే : ఏదైనా సందర్భంలో దొంగతనం అనేది జరిగింది అని గుర్తించి అప్పుడు వారిని అడిగితే వారు నిజం చెప్పితే మెచ్చుకోండి. మీరు పోగొట్టుకున్న వస్తువులను ఇవ్వమని అడగండి.అప్పుడు వారే ఇచ్చేస్తారు.ఇలాంటి పెద్ద తప్పులు చేయటం అసలు మంచిది కాదు అని అర్థమయ్యేలా చెప్పండి.
మనది కాదని : పిల్లలకు ఎప్పుడైనా సరే మన వస్తువులు, మన డబ్బులు మనకే సొంతం అని వారికి చెప్పాలి. అయితే వేరే వారి డబ్బును మరియు వస్తువులను అసలు ముట్టుకునే హక్కు మనకి లేదు అని మనం యజమానులము కాదు అని నమ్మకంగా చెప్పాలి.అలా వేరే వారి వస్తువులను అస్సలు ముట్టుకోకూడదు. వేరే వారి వస్తువులను తాకే ముందు వారి అనుమతి తీసుకోవాలి అని తెలియజేయాలి. ఇలాంటి పనుల వలన మన వస్తువులను మనం రక్షించుకోవచ్చు…