2024 Solar eclipse : ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం + సోమావతి అమావాస్య.. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

2024 Solar eclipse : ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం + సోమావతి అమావాస్య.. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు..

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2024,10:10 am

ప్రధానాంశాలు:

  •  2024 Solar eclipse : ఏప్రిల్ 8 అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం + సోమావతి అమావాస్య.. గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు..

  •  2024 Solar eclipse : ఏప్రిల్ నెల 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  •  రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించిన సుమారుగా 375 సంవత్సరాలు గడిచి పోతాయని చెప్పింది.

2024 Solar eclipse : ఏప్రిల్ నెల 8వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రుడు భూమికి సూర్యునికి మధ్య స్థానంలో ఉన్నప్పుడు దాని నీడ భూమిపై పడుతుంది. దీనిని సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణాలలో వివిధ రకాల గ్రహణాలు ఉంటాయి. అది పాక్షిక గ్రహణం ఇంకా ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా సూర్యుని కాంతిని నిరోధించలేదు. దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. అయితే సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుని వెలుతురు భూమి మీద పడకుండా చంద్రుడు పూర్తిగా అడ్డుకుంటాడు. సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉన్నప్పుడు ఉపరితలం మొత్తాన్ని కవర్ చేయదు. అప్పుడు అగ్ని వలయం కనిపిస్తుంది. దీనినే హైబ్రిడ్ సూర్యగ్రహణం అని కూడా అంటారు.దీనిని అరుదైన సూర్యగ్రహణం గా కూడా పరిగణించడం జరుగుతుంది. ఇక సూర్యగ్రహణం అమావాస్య సమయంలో మాత్రమే జరుగుతుంది. నాసా ప్రకారం ప్రతి సంవత్సరం రెండు నుంచి ఐదు సూర్యగ్రహణాలు జరుగుతాయి. అయితే ప్రతి గ్రహణం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది.

పాక్షికంగా కనిపిస్తాయని కూడా నాసా ఈ సందర్భంగా తెలిపింది. రెండు సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించిన సుమారుగా 375 సంవత్సరాలు గడిచి పోతాయని చెప్పింది.కొన్ని సందర్భాలలో ఇది ఎక్కువ కూడా కావచ్చు అని పేర్కొంది. అయితే ఈసారి ఆసక్తికరంగా యూఎస్ లోని అనేక ప్రాంతాల గుండా వెళ్తుంది. 2017 -2023 లో కూడా అక్కడ గ్రహణాలు కలిగాయి. మరి గ్రహణాల సమయంలో ఆహారం తీసుకోవాలా వద్దా అనేది చాలామందిలో ఉండే అపోహ అయితే ఆ సమయంలో తయారుచేసిన ఆహారంపై రేడియేషన్ ప్రధాన ఉంటుందని అదే విషపూరితంగా మారేటటువంటి అవకాశం కలుగుతుందనే అపోహ ఉంది. చంద్రగ్రహణం చూసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సూర్యగ్రహణం చూడాలనుకుంటే మాత్రం కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సోలార్ ని చూపించే హ్యాండ్ హోల్డర్స్ ని ఎంచుకోవాలి. ఎక్లిప్స్ గ్లాసెస్ లో చూడొచ్చు.. ఇది సన్ గ్లాసెస్ కంటే భిన్నంగా ఉంటాయి. ఫోటోగ్రాఫర్లు గ్రహణం సమయంలో సూర్యుడిని లెన్స్ కెమెరాతో చూడకూడదని కూడా నాసాఫ్ ఎక్కువుంది ముఖ్యంగా ఈ గ్రహణం అనేది భారతదేశంలో రాత్రిపూట కలుగుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు యధావిధిగా నిద్రపోతే సరిపోతుంది. ఇక ఇదే రోజున సోమావతి అమావాస్య కూడా వచ్చింది. ఈ అమావాస్య అంటే శివుడికి ఎంతో ప్రీతికరం ఈ సోమవతి అమావాస్య రోజున శివారాధనతో పాటు సంపదను పెంచుకునేందుకు కూడా ఎంతో సమయం శుభప్రదంగా ఉంటుంది.

కనుక ఈ రోజున కొన్ని సులభమైన పరిహారాలు చేయడం వల్ల ధనలక్ష్మి సంతోషిస్తుంది. మీకు డబ్బు కొరతా లేకుండా కూడా చేస్తుంది. కాబట్టి సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు 18 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అలాగే రాగి చెట్టుకు నూలు దారాన్ని కూడా చూట్టాలి. అనంతరం భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే కనుక మీ నుంచి పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు విపరీతంగా పెరుగుతుంది. ఇక సోమవతి అమావాస్య రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసి చెట్టును పూజించడం కూడా ఎంతో ముఖ్యమైంది. ఈ రోజున 108 సార్లు తులసి కార్యక్రమాలు చేస్తే దరిద్రం తొలగిపోతుంది. మరోపక్క తులసి చెట్టుకు తెల్లవారుజామున నీళ్ళు పోసి నుదుటిపై తులసి మట్టితో తిలకం రాసుకోవాలి. సాయంత్రం పూట తులసి పూజ చేసి దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. ఉప్పుకు సంబంధించిన పరిహారం ఎంతో ప్రతిభవంతంగా కూడా పనిచేస్తుందని ఎంతో మంది చెప్తారు. నీటిలో 50 గ్రాముల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. దీని వల్ల కచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల ఫలితాలు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. సోమవతి అమావాస్య రోజున పంచదార కలిపిన పిండిని చీమలకు తినిపించడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఐక్యత కూడా పెరుగుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది