Ayodhya Ram Mandir : అయోధ్య నుండి ప్రతి ఇంటికి వచ్చే రాముని అక్షింతలను ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ayodhya Ram Mandir : అయోధ్య నుండి ప్రతి ఇంటికి వచ్చే రాముని అక్షింతలను ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ayodhya Ram Mandir : అయోధ్య నుండి ప్రతి ఇంటికి వచ్చే రాముని అక్షింతలను ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే...!

Ayodhya Ram Mandir : అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన రాముని అక్షింతలు ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే.. అయితే అయోధ్య నుండి మీ ఇంటికి వచ్చిన అక్షింతలను ఏం చేయాలి. వాటితో ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకోవచ్చు.. విశిష్టత ఏంటి.? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ఏంటంటే అయోధ్య రామ జన్మభూమి ఎన్నో తరాల వారికి మానవజాతికి ఆదర్శ పురుషుడిగా నిలిచిన రాముడి జన్మస్థలంలో రామ మందిరంలో ప్రస్తుతానికి తొలి దశ పూర్తయింది. రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. రామ మందిరంలో రామయ్య అందరికీ దర్శనం ఇవ్వనున్నారు. జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఈ దేవాలయం ప్రారంభోత్సవం కోసం దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్య రామ మందిరంలోని విగ్రహాలకు కూడా ఎంతో ప్రత్యేకత అనేది ఉంది. ప్రస్తుతం అయోధ్య రామ మందిరంలో మూడు ప్రత్యేక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏది ప్రధానమైందని ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతానికి మూడు వేరు వేరు విగ్రహాలను రూపొందిస్తున్నారు. వీటిలో రెండు శిలలు కర్ణాటక రాష్ట్రం నుంచి కాగా మరొకటి రాజస్థాన్కు చెందింది.

వీటిలో ఏది ఉత్తమమైనదో రామ మందిరం ట్రస్ట్ కమిటీ నిర్ణయిస్తుంది. రామాయణం మరియు మహాభారతం వంటి పురాతన గ్రంథాలలో దాని ప్రస్తావనతో అయోధ్య హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రగా మారింది. నగరం యొక్క సాంస్కృతిక గుర్తింపు దాని చరిత్ర మరియు మతపరమైన ప్రాముఖ్యతతో లోతుగా ముడిపడి ఉంది. సరైన ఉన్న అయోధ్య యాత్రికులు చరిత్రకారులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది.అయోధ్య నుండి రాముడి అక్షింతలు ప్రతి ఇంటికి కూడా చేరుతున్నాయి. అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏం చేయాలి. అని అనుమానం చాలా మందిలో ఉంది. అయితే అక్షింతలు ఇంటికి వచ్చిన తరువాత వాటిని అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షితలతో అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపటం అంటే మీ ఇంట్లో కొన్ని అక్షింతలు మీరు తయారు చేసి పెట్టుకోండి. ఈ విధంగా అక్షతలు మీరు అయోధ్య నుండి వచ్చిన అక్షితలను కలపండి. ఈ యొక్క కలుపుకున్న అక్షితులను జనవరి 22వ తేదీన అన్ని 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇల్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకుని గ్రామంలోని దేవాలయానికి వెళ్లాలి. పూజలు ముగించుకొని వ్యక్తిగతంగా నెత్తిన వేసుకోవాలి.

అలాగే మీ కుటుంబ సభ్యులు అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాల్లందరికి, పిల్లల పుట్టిన రోజున పెళ్లి కార్యక్రమాలు ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో వారిని దీవించాలి. ఎవరైనా ఆశీర్వాదం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు వారి పైన కొన్ని అక్షతలు వేసి వారిని దీవించవచ్చు. అయితే జనవరి 22వ తేదీన మీ యొక్క ఇంటికి దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి హారతి మరియు ప్రసాద వితరణ కూడా ఉంటుంది.దీనిలో కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనాలి. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని కూడా మీరు ఆహ్వానించండి. ఆరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి. దీపావళి పండుగను ఏ విధంగా అయితే చేసుకుంటారో జనవరి 22వ తేదీన మీరు ఆ విధంగా చేసుకోవచ్చు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది