Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే… లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది …! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే… లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది …!

Diwali : హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఈ నెల 31వ తేదీన రావడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజు కూడా అమావాస్య ఉండడంతో ఆరోజు కూడా ఈ పండుగను జరుపుకోవచ్చు. అయితే దీపావళి పండుగ రోజు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అందుకే హిందూ సాంప్రదాయాలలో దీపావళి పండుగను పవిత్రమైన దినంగా పేర్కొనడం జరిగింది. ఇక ఈ దీపావళి పండుగ రోజు […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 October 2024,6:00 am

Diwali : హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఈ నెల 31వ తేదీన రావడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజు కూడా అమావాస్య ఉండడంతో ఆరోజు కూడా ఈ పండుగను జరుపుకోవచ్చు. అయితే దీపావళి పండుగ రోజు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అందుకే హిందూ సాంప్రదాయాలలో దీపావళి పండుగను పవిత్రమైన దినంగా పేర్కొనడం జరిగింది. ఇక ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభించి అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ఈ దీపావళి పండుగ తర్వాత నుండి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కొన్ని రాశుల వారిపై పడనుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో ఆటంకాలు అన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. మరి దీపావళి తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం ఏ ఏ రాశుల వారికి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Diwali మేషరాశి

దీపావళి పండుగ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ సమయం వీరికి అదృష్టమైన సమయంగా పేర్కొనవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. ఇక ఈ సమయంలో మేష రాశి వారు ఎలాంటి పని మొదలుపెట్టిన దానిలో తప్పక విజయం సాధిస్తారు.

వృషభ రాశి : లక్ష్మీదేవి కటాక్షంతో వృషభ రాశి వారికి అదృష్టం పడుతుంది. దీపావళి పండుగ రోజు నుంచే వీరు అనుకున్న పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి.

Diwali దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది

Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే… లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది …!

మిధున రాశి : లక్ష్మీదేవి అనుగ్రహంతో మిధున రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వలన అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది