ఈ 3 పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి… లేకపోతే ప్రాణాలకే ప్రమాదం…!!
స్నానం చేయడం అనేది నిత్య కృత్యాల్లో ఒక భాగం. పూజ చేయడం వలన మనసు ప్రశాంతత. స్నానం చేయడం వలన దేహం పరిశుద్ధమవుతుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మన పెద్దవారు సూర్యోదయానికి ముందే స్నానం చేసి పూజాది కాలు ముగించుకుని వారి పనిలో నిమగ్నమయ్యేవారు. కానీ ప్రస్తుత బిజీ లైఫ్ లో దేనికి సరైన టైమ్ ఉండటం లేదు. సమయం కుదరక స్నానం చేయడానికి కూడా కొంతమంది వాయిదా వేస్తున్నారు. అయితే ఏ సమయంలో స్నానం చేసినా చేయకపోయినా సరే ఈ మూడు పనులు చేసిన తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయాలి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అవి ఏమిటంటే బంధువులు తెలిసినవారు చనిపోయినప్పుడు వారి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి ఇంటికి వస్తారు ఇది మానవత్వం.
అయితే చనిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి వచ్చి నేరుగా ఇంట్లోకి వెళ్ళకూడదని స్నానం చేయకుండా ఎవరిని ముట్టుకోవద్దని స్నానం చేశాకే లోపలికి రమ్మని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కొంతమంది ఇది చాదస్తమని కొట్టిపారేసినా దీని వెనక మరమం ఉంది. చనిపోయిన వారి శరీరం నుండి సమయం గడిచే కొద్దీ హాని కాయక బ్యాక్టీరియా బయటకు విడుదలవుతూ ఉంటుంది. అది అక్కడ ఉన్న వారి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే చనిపోయిన వారి దగ్గరికి వెళ్లి వచ్చినప్పుడు శుభ్రంగా స్నానం చేసిన తర్వాతనే లోపలికి రమ్మని మన పెద్దలు చెబుతారు. వారి మాటలు పట్టించుకోకుండా ఏమవుతుంది ఇంటి లోపలికి వస్తే మీతో పాటు వచ్చిన హానిక హానికర బ్యాక్టీరియా మీ కుటుంబ సభ్యుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
అలానే దంపతులు ఇద్దరు కలిసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాతనే మిగతా పనులు చేయాలంటారు.ఇద్దరు స్నానం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదట. ఇలా చేస్తే మహా పాపమని మన గ్రంథాల్లో చెప్పబడింది. అలా అని కటింగ్ షేవింగ్ చేయించుకున్న తర్వాత స్నానం చేయకుండా ఇంటి లోపలికి అస్సలు వెళ్ళకూడదు..శుభ్రంగా తలస్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి. ఒకవేళ ఏమవుతుందిలే అని ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతే శరీరం పై ఉన్న వెంట్రుకలు ఇంట్లో ఆహార పదార్థాల మీద పడి మీ ఇంట్లో వారి అనారోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంది. అలానే జుట్టు అనేది మీ శరీరంలో ఒక భాగం ఉంటుంది. దానిలో కూడా ఒక జీవం ఉంటుంది.అందుకే క్షవరాన్ని మంగళవారం, శుక్రవారం అమావాస్య అష్టమి రోజుల్లో చేయించుకోవద్దని మన పెద్దలు చెబుతారు.