Ahalya : అహ‌ల్య నిజంగా ఇంద్రునితో.. తప్పు చేసిందా..? అహ‌ల్య రియ‌ల్ స్టోరీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ahalya : అహ‌ల్య నిజంగా ఇంద్రునితో.. తప్పు చేసిందా..? అహ‌ల్య రియ‌ల్ స్టోరీ..!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Ahalya : ఇంద్రుడితో అహల్యను చూసిన ఆమె భర్త ఏం చేశాడో తెలుసా..?

Ahalya : అసలు అహల్య పుట్టుకే ఎంతో గమ్మత్తుగా ఉంటుంది. క్షీర సార అమృతంన్ని రాక్షసులకు దక్కకుండా కపట నాటకంతో దేవతలందరూ ఒక్కరికే పంచడానికి విష్ణుమూర్తి మోహిని రూపం దాలుస్తాడు. అపురూప సౌందర్యవతి అయిన మోహిని చూసి శివునితో సహా బ్రహ్మాజీ దేవతలందరూ ఆమెపై మనసు పారేసుకుంటారు. అప్పుడు బ్రహ్మ పక్కనే ఉన్న సరస్వతి మీ సృష్టిలో ఎప్పుడైనా ఇంత అందంగా సృష్టించారా అని కొంచెం హేళనగా మాట్లాడుతుంది. దీంతో బ్రహ్మకు కోపం వచ్చి తన మనస్సులో నుండి ఈ 14 లోకంలో ఎక్కడ లేని ఒక అపురూప సౌందర్యవతిని సృష్టిస్తారు. ఇంద్రుడు అందుకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బ్రహ్మ తన కూతుర్ని ఇక్కడే ఉంచితే అందరి కళ్ళు తనపై పడతాయని గౌతమణికి అహల్యను పెంచమని అప్పగిస్తాడు. ఇంతకాలం పెంచి పెద్ద చేసిన అహల్య తనకు భార్య అయితే బాగుంటుంది కదా అని ఆలోచనలో పడ్డ గౌతముడు తాను కూడా స్వయంవరంలో పాల్గొంటారు. వారికి మీలో ఎవరైతే భూప్రదక్షిణ చేసి ముందుగా వస్తారు. వారి అహల్యకు తగిన వరుడని బ్రహ్మ ప్రకటిస్తారు. ఎలాగైనా దక్కించుకోవాలని ఆశతో ఇంద్రాది దేవతలంతా తాము ఉందంటే తాము అని పోటీలు నెగ్గడానికి బయలుదేరుతారు. పడకుండా గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. కొలువై ఉంటారు కావున గోవు చుట్టూ గౌతముల ప్రదక్షిణ చేస్తారు.

దీనిని బ్రహ్మ తన మనోనేత్రంతో చూసి గౌతమ్ ని ప్రజ్ఞా పాటవాలకు మెచ్చుకొని ఇచ్చి గౌతములతో తానే స్వయంగా వివాహం జరిపిస్తాడు. కట్టు కానుకలుగా గౌతముడికి బ్రహ్మగిరి పర్వతాన్ని కానుకగా ఇస్తాడు. అహల్య తనకు దక్కలేదని ఇంద్రుడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనకు కాకుండా పోయిన అహల్య ను ఎలా అయినా మాయోపాయంతో అయినా అనుభవించాలని ఇంద్రుడు అందుకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరోవైపు గౌతముడు జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మీరు అన్యోన్య దాంప త్యానికి గుర్తుగా వీరికి శాఖ నందుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఇంద్రుడు మాత్రం గోతి కాడ నక్కలాగా గౌతమణి ఆశ్రమం చుట్టూ అదృశ్యరూపంలో తిరుగుతూ ఆయన దినచర్యలను గమనిస్తూ ఉంటాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఇక కోరిక చంపుకోలేని ఇంద్రుడు ఈరోజు అహల్యను ఎలాగైనా అనుభవించాలని భావించి కపట ఆలోచన చేసి కోడి రూపంలోకి మారి గౌతమణి వినపడేలా బిగ్గరగా కూస్తాడు. కోడి కుతా విని తెల్లవారింది అనుకొని గౌతముడు నదీ స్నానానికి వెళ్తాడు. గౌతముడు బయటకు వెళ్లడంతో ఇంద్రుడు గౌతమ్ మహర్షి రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్య ఎదుట తన కామ వాంఛను తన భర్త కదా అని భావించిన అహల్య అతని కోరికను సమ్మతించి గౌతమి రూపంలో ఉన్న ఇంద్రునితో శృం..లో పాల్గొంటుంది. అయితే కొన్ని చోట్ల అహల్య వచ్చింది ఇంద్రుడు అని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని కూడా అతనితో తప్పు చేసిందని చెప్పబడింది. అనుమానపడ్డ గౌతముడు ఏదో తప్పు జరుగుతుందని భావించి తిరిగి తన ఆశ్రమానికి వస్తాడు.

తన వేశంలో ఉన్న ఇంద్రుడు గడుపుతున్న సన్నివేశాన్ని చూస్తారు. దీంతో వీరిద్దరిని చూసి అసహ్యించుకున్న గౌతముడు అహల్యను చూస్తూ ఆమె ఎంత చెప్తున్నా ఏమీ వినిపించుకోకుండా నీకు ఏ అందం వల్ల ఈ పరిస్థితి వచ్చిందో నీవు ఎక్కడైతే తప్పు చేశావో అక్కడే రాయిగా మారి మట్టితో సహవాసం చేస్తూ గాలిని ఆహారంగా తీసుకుంటూ ఉండు అని శపించి త్రేతా యుగంలోని నీవు పవిత్రురాలుగా మారతావని అప్పుడు నిన్ను నేను స్వీకరిస్తానని ఆమెకు షాప విమోచనం కూడా చెప్పాడు. గౌతమిని శాపంతో అహల్య రాయిగా మారిపోగా ఇందులోని పురుషాంగం తెగిపడి అతని వంటి నిండా 1000 యోని రూపాలు వచ్చేస్తాయి. ఈ విషయం ఆ నోట అందరికీ తెలిసిపోవడంతో సిగ్గు పడిన ఇంద్రుడు తన మొహం ఎవరికి చూపించుకోలేక ఒక గుహలో రహస్యంగా దాక్కుంటాడు. ఇంద్రుడు తన బాధ్యతలను వదిలివేయడంతో సకల లోకాలు గది తప్పి సృష్టంతా మారుతుంది. అహల్య ఉన్న ప్రదేశమునకు శ్రీరాముడు వచ్చి అహల్య మారిన రాయిపై శ్రీరాముడు పాదములు మోపుతాడు దాంతో అహల్యకు మోక్షం కలిగితుంది. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చాడని తెలుసుకున్న గౌతమును సంతోషించి రాముని సమక్షంలో తిరిగి స్వీకరిస్తారు. అంతటితో కథ సుఖాంతం అవుతుంది..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది