Shani Devudu : మీరు శని దోషం వలన పీడింపబడుతున్నారా…. అయితే, మీరు ఈ ఇవి చేస్తే చాలు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shani Devudu : మీరు శని దోషం వలన పీడింపబడుతున్నారా…. అయితే, మీరు ఈ ఇవి చేస్తే చాలు…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Shani Devudu : మీరు శని దోషం వలన పీడింపబడుతున్నారా....అయితే, మీరు ఈ ఇవి చేస్తే చాలు...?

Shani Devudu : ప్రతి ఒక్కరి జాతకంలో కూడా శని దోషం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే సాధారణంగా శని దేవుడు అనగానే చాలామందికి ఒంట్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే శని దోషం ఉన్నవారికి జీవితంలో అనేక కష్టనష్టాలను చూడాల్సి వస్తుంది.శని నెమ్మదిగా కదిలే గ్రహం. శని దేవుడు ఎవరికైతే దోషం ఉంటుందో వారికి రెండున్నర సంవత్సరాలు వరకు తన ప్రభావాన్ని చూపిస్తాడు. దోషము ఉంటే శని దుష్ప్రభావాల వ్యక్తి వల్ల పాటు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. శని, కర్మలకు ఆధారంగా ఫలితాలను ఇస్తుంటాడు.శని దేవుడు న్యాయదేవుడుగా కూడా పిలుస్తారు. శని దోష నివారణకు కొన్ని మార్గాలను నివారణలను గురించి జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

Shani Devudu మీరు శని దోషం వలన పీడింపబడుతున్నారా అయితే మీరు ఈ ఇవి చేస్తే చాలు

Shani Devudu : మీరు శని దోషం వలన పీడింపబడుతున్నారా…. అయితే, మీరు ఈ ఇవి చేస్తే చాలు…?

Shani Devudu శని దోషం ఉంటే ఏం చేయాలి

శనిశ్వరుని చేత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు శివున్ని, హనుమంతుని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.ఈ దోషం నుంచి విముక్తి పొందాలంటే శనివారం దేవాలయాలను దర్శించండి. ఈ రోజున శని యంత్రంతో పూజ చేస్తే దోషం తొలగిపోతాయి. శని వారం ఉదయం ఉపవాసముండే,శని భగవాన్ ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించి వస్తే పుణ్యఫలం లభిస్తుంది. లింగ స్వరూపుడు శివునికి స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేయాలి. బిల్వపత్రాలను అర్చన చేసి మొదలైనవే చేస్తే శని దోషం తొలగుతుంది.శని దేవునికి ప్రీతి కరమైన శనివారం రోజున,లేనివారికి, చేతకాని వారికి బంగారం, వస్తూ, ఆహారం,వంటివి దానం చేస్తే, శని వారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా, శనగపిండి నెయ్యి వస్త్రాలు లాంటివి దానం చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి.

శని వారం తెల్లవారుజామున నిద్రలేచి, నువ్వుల నూనెతో తల స్నానం చేసి, భక్తిశ్రద్ధలతో శని మంత్రాన్ని పఠించండి.ఇలా చేస్తే అన్ని రకాల బాధల నుండి విముక్తి పొంది దీర్ఘాయువుతో మంచి బుద్ధితో అన్ని చెడులకు దూరంగా జీవిస్తారు. శని దోషం ఉంటే నివారణ కోసం ప్రతి శనివారం నాడు శనిదేవుని ఆలయానికి వెళ్లి దర్శించండి. ఆ రోజున శివాలయంలో శివ చాలీసా పటించండి.శని అశుభ ప్రభావాలనుంచే తప్పించుకోవచ్చు. ఉదయాన్నే లేచి తల స్నానం చేసి 108 సార్లు శని దేవునికి ధ్యానం చేయండి. రోజు కాకికి పెసరపప్పుని ఆహారంగా వేయండి లేదా దానం చేయండి. ఆలయాలలో 9 సార్లు నవగ్రహ పూజలు చేయాలి. నీలి రాతి ఉంగరం ధరిస్తే శని దోషం తగ్గుతుంది.శనివారం తెల్లవారుజామున సుందరకాండ పారాయణం వల్ల కూడా శనిగ్రహ దోషం దూరం అవుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది