Bathukamma Festival : బతుకమ్మ పండుగలో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో మీకు తెలుసా ?
Bathukamma Festival : బతుకమ్మ పండుగ… ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద పూల పండుగ. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే ఈ పండుగలొ ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత. అదేవిధంగా ఆయా రోజుల్లో పూజించే బతుకమ్మకు వేర్వేరు పేర్లు అంటే సాక్షాత్తు శ్రీ విద్యా ఉపాసన పద్ధతిలోనే బతుకమ్మ ఆరాధన చేస్తారు. ఏ రోజు ఏ పేరుతో బతుకమ్మను పిలుస్తారు. ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం….
Bathukamma Festival : ఒక్కొక్క రోజు బతుకమ్మ రూపం మరియు సమర్పించాల్సిన ప్రసాదంలు :
మొదటి రోజు - ఎంగిలిపువ్వు.
నువ్వులు, నూకలు , బెల్లం.
రెండోవ రోజు - అటుకుల బతుకమ్మ.
చప్పిడి పప్పు, బెల్లం, అటుకుల ప్రసాదం.
మూడోవ రోజు – ముద్దపప్పు బతుకమ్మ.
ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు.
నాలుగొవ రోజు – నానే బియ్యం.
బతుకమ్మ నానపెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి సమర్పిస్తారు.
ఐదొవ రోజు -అట్ల బతుకమ్మ.
అట్లు లేదా దోష నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరొవ రోజు -అలిగిన బతుకమ్మ.
ఈ రోజు ఆశ్వయుజ పంచమి కాబట్టి నైవేద్యం ఏమీ సమర్పించరు.
ఏడొవ రోజు -వేపకాయల బతుకమ్మ.
బియ్యపిండిని బాగా వేయించి వేపపళ్ళుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదొవ రోజు -వెన్నముద్దల బతుకమ్మ.
నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారుచేసి సమర్పిస్తారు.
Bathukamma Festival : తొమ్మిదొవ రోజు- సద్దుల బతుకమ్మ.
ఆశ్వయుజ అష్టమి రోజు, అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు.కాబట్టి ఐదు రకాల నైవేద్యాలు అంటే పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం తయారుచేసి సమర్పిస్తారు.ఈ తొమ్మిది రోజులపాటు రోజూ సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, జీడిపప్పు, బెల్లం, పాలను ఉపయోగిస్తారు.