Telangana Bathukamma Festival History : బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారు? బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి? పూలను ఎందుకు పూజిస్తారు? దాని వెనుక జరిగిన ఘటన ఇదే
Telangana Bathukamma Festival History : బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఈ పండుగను తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ అంటే పూలను పూజించే పండుగ. అసలు బతుకమ్మ పండుగను తెలంగాణలోనే ఎందుకు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి.. బతుకమ్మ పండుగ చరిత్ర ఏంటి.. దానికి సంబంధించి ఎలాంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి బతుకమ్మ పండుగకు […]
Telangana Bathukamma Festival History : బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఈ పండుగను తెలంగాణ వ్యాప్తంగా తొమ్మిది రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ అంటే పూలను పూజించే పండుగ. అసలు బతుకమ్మ పండుగను తెలంగాణలోనే ఎందుకు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ విశిష్టత ఏంటి.. బతుకమ్మ పండుగ చరిత్ర ఏంటి.. దానికి సంబంధించి ఎలాంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిజానికి బతుకమ్మ పండుగకు సంబంధించి మూడు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక కథ ఏంటంటే.. తమిళనాడులో ఉన్న బృహదీశ్వరాలయం తెలుసు కదా. ఇది ఎంతో ప్రఖ్యాతి గాంచిన గుడి. వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ ఆలయానికి. ఈ ఆలయంలో ఉన్న శివుడి లింగం.. తెలంగాణలోని వేములవాడకు చెందినది. ఇక్కడ ఉన్న శివుడి లింగాన్ని అక్కడికి తీసుకెళ్లిపోవడం వల్ల ఒంటరిగా మిగిలిన పార్వతి దేవి విగ్రహం నుంచి బతుకమ్మ పండుగ పుట్టింది అంటారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది బతుకమ్మ పండుగ. తెలంగాణలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడో ఉన్న తెలంగాణ వాళ్లు బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంటారు.
Telangana Bathukamma Festival History : బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది?
ప్రకృతిని ఆరాధించడం అనేది కొత్తేమీ కాదు. అది అంతటా ఉన్నదే. పూలను పూజించడం కూడా ఒక పద్ధతి. పూలను బతుకమ్మగా పేర్చి పెద్ద పండుగగా చేస్తారు. బతుకమ్మ పండుగలో ఎలాంటి బేధాలు ఉండవు. ఇది ఒక సామాజిక ఉత్సవంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యవసాయ సంస్కృతి నుంచి ఇది ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు.
వేములవాడలో రాజరాజేశ్వర ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అక్కడ ఉన్న ఆలయంలోని శివ లింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరులో పెట్టి బృహదేశ్వరాలయంలో నిర్మించారు. అప్పటి రాజు.. రాజరాజచోళ ఈ పని చేయడంతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిని తమ దుఃఖాన్ని తెలియజేసేందుకు భారీ పర్వతంగా బతుకమ్మను పేర్చి రాజరాజచోళకు పంపించి వాళ్ల బాధను తెలియజేశారు. అలా.. బతుకమ్మ పండుగ ప్రారంభం అయినట్టు చరిత్ర చెబుతోంది.
మరో కథ ఏంటంటే.. ధర్మాంగదుడు అనే రాజు సంతానం కోసం పూజలు చేయగా.. ఆయనకు లక్ష్మీ కటాక్షం వల్ల కూతురు పుట్టింది. ఆమెకు చాలా గండాలు వచ్చాయి. ఆ గండాల నుంచి గట్టెక్కి ఆయన కూతురు బతకాలని చెప్పి బతుకమ్మ అనే పేరు పెట్టినట్టు చరిత్ర చెబుతోంది.
మూడో కథ ఏంటంటే.. ఒక బాలిక భూస్వామ్యుల అరాచకాలను భరించలేక ఆత్మహత్య చేసుకుందని.. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ బాలికను బతికించాలని గౌరమ్మను వేడుకున్నదని.. అలా పుట్టిందే బతుకమ్మ అని చెబుతున్నారు.
పువ్వు ఉంటేనే జన్మ ఉంటుంది కాబట్టి.. పువ్వు నుంచి కాయ, ఆ కాయ నుంచి పండు అవుతుందని.. స్త్రీ కూడా పువ్వుతో సమానం అని.. ఒక ఆడ పిల్ల ఉంటేనే జీవితం వస్తుందని.. పువ్వు అలాంటి ఆడపిల్లను బతికించాలని.. ఆడపిల్లకు హానీ తలపెట్టవద్దని మొదలైందే ఈ బతుకమ్మ పండుగ.
బతుకమ్మ పండుగలో అన్ని పూలు వాడుతారు. బతుకమ్మలో పసుపుతో చేసిన గౌరమ్మను వాడుతారు. తల్లీబిడ్డల అనుబంధానికి చిహ్నంగా పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మను చేస్తారు. బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలంతా తమకు ఎలాంటి ఆపద కలగకూడదని వేడుకుంటారు.
బతుకమ్మ పండుగ అంటేనే పూలను ఆరాధించే పండుగ. పూలు వికసించే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ సంబంధాలను చూపిస్తుంది. అందరినీ చల్లగా చూడాలని గౌరమ్మను మొక్కి మళ్లీ రావాలని గౌరమ్మను సాగనంపుతారు.
తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు రోజుకో బతుకమ్మను పేర్చి.. ఆడి పాడి చివరి రోజు మళ్లీ రావమ్మా బతుకమ్మ అంటూ గౌరమ్మను నీటిలో సాగనంపుతారు. మహాలయ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం అవుతుంది. దాన్నే పెత్రమాస అంటారు.
ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నాన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు.