Bhavishyavani : కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది..? భవష్యవాణిలో ఏముందంటే…!
ప్రధానాంశాలు:
Bhavishyavani : కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది..? భవష్యవాణిలో ఏముందంటే...!
Bhavishyavani : మనలో చాలామందికి రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలంగా ఉంటుంది. రాశిఫలాలను చూస్తూ తమరాశికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే పోతూలూరి వీరభద్రం స్వామి కొన్ని తరాల ముందు ఏం జరగబోతుందో అనేది ముందుగానే చెప్పారు.ఇలా కాలజ్ఞానం ముందుగానే ప్రచురించే వాళ్ళలో అచ్చుతానంద దాస్ కూడా ఒకరు. ఈయన చెప్పే విషయాలు నిజంగా మన భవిష్యత్తులోకి వెళ్లి తెలుపుతున్నట్లు ఉంటుంది.ఆయన గతం వర్తమానం భవిష్యత్తులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని చూడగలిగే వారు అని ప్రజలను నమ్మకం.సాధువు అయినటువంటి అచ్చుతానంద దాస్ చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Bhavishyavani : కలియుగం ఎలా అంతమవుతుంది
భవిష్యవాణి పుస్తకంలో కలియుగం ఎలా అంతమవుతుంది అనే విషయాన్ని ఆయన లోతుగా వివరించారు. దీని ప్రకారం కలియుగం అంతమయ్యే ముందు ఈశ్వరుడిని ప్రజలు మర్చిపోతారట .దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతారట.ధర్మాన్ని పాటించేవారు తక్కువైపోతారు. సమాజంలో గురువులకు బాగా చదువుకున్న వారికి విలువ లేకుండా పోతుంది.బాబాలు ప్రజలను మోసం చేయడానికి చూస్తారు. ప్రజలు తమ సంస్కృతిని ఆచారాలను మర్చిపోయి దుర్మార్గపు జీవితాన్ని గడుపుతారు. నేరస్తులు భయం లేకుండా పెద్ద పెద్ద ఆయుధాలను వీధుల్లోనే వాడుతారు. స్త్రీ పురుషులు అక్రమ సంబంధాలను పెట్టుకుంటారు.వ్యభిచారాన్ని వృత్తిగా ఎంచుకుంటారు.కలియుగాతం సమయం లో కొద్ది ఆహార కరువు ఉంటుంది.వివిధ రకాల జబ్బులు పెరుగుతాయి. ప్రమాదాలు జరుగుతాయి.
ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడతారు.మహావినానం చోటు చేసుకునే దగ్గర రైతులు వ్యవసాయం పట్ల ఆసక్తి కోల్పోతారని క్రూర మృగాలు గ్రామాల్లోకి పట్టణాలకు చొరబడి మనుషులను వేటాడి చంపుతాయని భవిష్యవాణి పుస్తకంలో ఉంది.అంతే కాదు సూర్యుడి తాపం పెరిగి వాతావరణం అల్ల కొల్లంగా మారుతుంది.తుఫానులు బీభత్సం సృష్టిస్తాయి.ఆ శబ్దానికి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు.పూరి జగన్నాథ్ ఆలయంలోని జెండా పదేపదే కిందకు పడిపోతూ ఉంటుందని భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. మరి భవిష్యవాణిలో చెప్పిన అంశాలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.