Chanakya Niti : ఇలాంటి వారిని కలలో కూడా నమ్మవద్దు.. పాము కంటే డేంజ్ అంటున్న చాణక్యుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : ఇలాంటి వారిని కలలో కూడా నమ్మవద్దు.. పాము కంటే డేంజ్ అంటున్న చాణక్యుడు..!

 Authored By mallesh | The Telugu News | Updated on :11 February 2022,7:40 am

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గురించి చాలా మందికి తెలుసు.. ఈయన గొప్ప పండితుడు, ఆర్ధిక శాస్త్ర వేత్త.. తన తెలివి తేటలతో చంద్ర గుప్త మౌర్య సామ్రాజ్యానికి రాజుని చేసాడు.. ఆచార్య చాణిక్యుడు తన అనుభవాలను నీతి శాస్త్రంలో రచించాడు.. ఈ శాస్త్రంలో భార్య నుండి వ్యాపారం వరకు, స్నేహితుల నుండి శత్రువుల వరకు అందరి గురించి చాణుక్యుడు ప్రస్తావించాడు.ఆచార్య చాణుక్యుడు ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది అయినా నమ్మదగిన వ్యక్తులు ఉండాలని, వారి నుండి ఎటువంటి హాని జరగదని చెప్పాడు.

అయితే అదే సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో పాముల వంటి విషపూరితమైన వ్యక్తులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని.. మరి అలంటి వారిని ఎప్పుడు విశ్వసించ కూడదని, అలాంటి వారితో ఎప్పుడు మన బాధలను పంచుకోకూడదని చెప్పాడు.అంతేకాదు మన బాధను ఎవరైనా సరే వారితో పంచుకోకూడదని చెప్పారు. ఎందుకంటే వారికీ మన బాధలను చెప్పడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఇక కొంతమంది వ్యక్తులను ఎదుర్కొన్నప్పుడు సహనంతో, అవగాహనతో వ్యవహరించాలని అలంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని ఆచార్య చాణక్యుడు నమ్మాడు.

chanakya niti do not believe such people says danger is more than a snake

chanakya niti do not believe such people says danger is more than a snake

Chanakya Niti : అర్థం చేసుకోలేరు..

ఆచార్య చాణుక్యుడు ఈ ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారని.. వీరు వ్యక్తి సమస్యలను అర్ధం చేసుకోలేరని అలాగే ఇతరుల బాధలను పట్టించుకోరని.. ఎక్కువుగా గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేసే వారు కూడా ఇతరుల కష్టాలను చూసి బాధపడరని అన్నాడు..పాము విషం దాని కోరల్లో ఉంటుంది, ఈగకు తలలో, తేలు కి దాని తోకలో ఉంటుంది.అంటే అన్ని విష జీవులు ఏదొక భాగంలో విషాన్ని దాచుకుని ఉంటాయి.. కానీ మనస్సులో చెడు ఆలోచనలు ఉన్న వారి అవయవాలన్నీ విషంతో నిండి ఉంటాయి.. అలాంటి వారు తమ విషాన్ని ఎప్పుడైనా ఇతరులపై చిమ్ముతూనే ఉంటారు. కాబట్టి అలంటి వారికీ దూరంగా ఉండడం మంచిదని ఆయన చెప్పారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది