Chanakya Niti : జీవితంలో ఈ నాలుగు విషయాలు అస్సలుకే చేయకండి.. చేశారో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : జీవితంలో ఈ నాలుగు విషయాలు అస్సలుకే చేయకండి.. చేశారో

 Authored By mallesh | The Telugu News | Updated on :21 May 2022,7:40 am

Chanakya Niti : జీవితం… జీవితం అనేది పెద్ద మహాసముద్రం లాంటిదని చాలా మంది చెబుతారు. ఈ సుదీర్ఘ జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని విలువలు కలిగి ఉండాలని పేర్కొంటారు. ఇటువంటి విలువల కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెబుతారు. కావున జీవితంలో విలువలు, విశ్వసనీయతలు చాలా ముఖ్యం. ఆచార్య చాణక్యుడు జీవితంలో ఎలా ఉండాలో బోధించాడు. చాణక్యుని బోధనలు పాటించవారు జీవితంలో ఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కోరని చెబుతారు. వారు ఎల్లప్పుడూ విజయపథంలోనే దూసుకుపోతారు. కాబట్టే ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి విషయాలను చాలా మంది పాటిస్తూ ఉంటారు.

ఆచార్యుడు చెప్పిన నీతి శాస్త్రంలో నాలుగు విషయాలను గురించి చెప్పారు. ఈ నాలుగు విషయాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించాడు. పాత బట్టలు, నిరుపేద భాగస్వామి, ముసలి తల్లిదండ్రులు, సాధారణ జీవితం అనే నాలుగు అంశాల్లో ప్రతి ఒక్కరూ ఎప్పటికీ సహజసిద్ధంగా ఉండాలని ఆచార్యుడు బోధించాడు.మనలో చాలా మంది ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినపుడు మంచి దుస్తులు వేసుకునేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు. పలానా బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాలని అనుకుంటారు. అటువంటి దుస్తుల కోసం చాలా కష్టపడతారు. కానీ మనం వేసుకునే దుస్తుల కంటే మన వ్యక్తిత్వమే చాలా గొప్పదని ఆచార్యుడు బోధించాడు.

Chanakya Niti Do not do these four things all in life

Chanakya Niti Do not do these four things all in life

Chanakya Niti : దుస్తుల క్వాలిటీ కన్నా.. వ్యక్తిత్వం ముఖ్యం

మనం ఎటువంటి దుస్తులు వేసుకున్నా కానీ వ్యక్తిత్వం సరిగ్గా ఉంటే గౌరవం దానంతట అదే వస్తుందని ఆయన పేర్కొన్నారు. మీకు ఉన్న స్నేహితులు, పేదలైనా కానీ అతడి వ్యక్తిత్వం మంచిగా ఉంటే అతడితో సన్నిహితంగా ఉండాలి. అతడి వ్యక్తిత్వం చూసి అతడితో స్నేహం చేయాలి కానీ అతడి వద్ద ఉన్న డబ్బును చూసి స్నేహం చేయకూడదని ఆచార్యుడు తెలిపాడు. ఇక ముసలి తల్లిదండ్రులు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ముసలి వాళ్లు కావాల్సిందే. ఆ దశను అనుభవించాల్సిందే. కావున మన ముసలి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా ఉండాలని ఆచార్యుడు తెలిపాడు. ఒకరి జీవనశైలి మీలాగ లేకుంటే అతడు మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అనుకోవద్దని ఆచార్యుడు తెలిపాడు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది