Chanakya Niti : భార్యాభర్తలు హ్యాప్పీగా ఉండాలంటే.. ఈ తప్పులు చేయకూడదంటున్న చాణక్య
Chanakya Niti : కౌటిల్యుడు గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు.. జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. తను రచించిన నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాణక్య అనుభవపూర్వకంగా చాలా విషయాలు వివరించాడు. పిల్లలను ఎలా పెంచాలి. ఎవరితో స్నేహం చేయాలి.. ఎలాంటి అలవాట్లను చేసుకోవాలి. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి.. ఆర్థికంగా ఎదగాలంటే ఏ విధంగా కష్టపడాలి. అలాగే జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి ఇలా చాలా అంశాలను నీతి శాస్త్రంలో వివరించాడు.చాణక్య నీతి ప్రకారం..
భార్యభర్తలు ఒకరిపై మరొకరు బాధ్యతగా నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో కూడా అబద్దాలు చెప్పుకోకూడదు. అప్పుడే వారి మధ్య ప్రేమ, గౌరవం ఉంటాయి. అలాగే ఇద్దరూ ఎప్పుడూ కలిసి మెలిసి ఉండాలి. మనస్పర్థలు తెచ్చుకుని మధ్యలో మరో వ్యక్తికి తావివ్వకూడదు. అప్పుడే కలకాలం హ్యాపీగా ఉంటారు. అలాగే కొపం బంధాలను తెంచుతుంది. అందుకే మితిమీరిన కోపం మంచిది కాదంటారు పెద్దలు. జీవిత భాగస్వామిపై కోపం చూపిస్తే అనర్థాలకు దారితీస్తుంది. అంతేతప్పా మంచి చేయదు. అందుకే కొపం తగ్గించుకుని సమస్యపై చర్చించుకుని కలిసి ఉండాలి.అలాగే ఏదైనా సమస్య ఉంటే ఇద్దరే మాట్లాడుకుని పరిష్కరిచుకోవాలి.
అన్ని విషయాలు ఇతరులకు చెప్పుకుని నవ్వుల పాలు కాకూడదు. కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచుకోవాలి. అది ఇద్దరికీ మంచిది. ఇతరులకు చెప్పినట్లైతే ఒకానొక సమయంలో మీపైనే ప్రయోగిస్తారు. వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకుని బాధపడితే మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎగతాలి చేస్తారు. అందుకే భార్యభర్తలు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని కలిసిమెలసి జీవించాలి. అలాగే ఒకరినొకరు గౌరవించుకోవాలి.. ఏ విషయంలో కూడా భాగస్వామిని కించపర్చకూడదు. నిందలు వేసుకోవవడం మానుకోవాలి శాంతంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకోవాలి. అప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది.