Chanakya Niti : ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya Niti : ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? ఎలాంటి లక్షణాలు ఉండాలి?

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 February 2022,10:00 pm

Chanakya Niti : చాణక్య నీతిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. చాణక్య నీతిని తెలుసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ల జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఆచార్య చాణక్యుడు తన జీవితంలో తనను ఎదుర్కొన్న కష్టాలను, సమస్యలను.. తన అనుభవాలను చాణక్య నీతి అనే పుస్తకంలో రచించారు. అవి ఇప్పుడు మనకు దారిని చూపిస్తున్నాయి.భగవద్గీత మనకు ఎలా బతకాలో నేర్పిస్తుంది. ఎదుటివారితో ఎలా మెలగాలో చెబుతుంది. జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో నేర్పిస్తుంది. అలాగే.. చాణక్య నీతి కూడా అంతే. చాణక్య నీతి ద్వారా ఎన్నో విషయాలను మనం తెలుసుకోవచ్చు. చాలామంది తమ జీవితంలో డబ్బులు సంపాదించడం కోసమే ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తుంటారు. గొడ్డులా కష్టపడుతుంటారు. కానీ.. చాణక్య నీతిలో ధనవంతుడు అవ్వాలి అని అనుకునే వాళ్లు ఏం చేయాలో చాణక్యుడు చెప్పుకొచ్చాడు.

ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే ముందు డబ్బును ఆదా చేయడం నేర్చుకోవాలి. ఆ వ్యక్తి ఎంత సంపాదించినా కూడా డబ్బును ఆదా చేయలేకపోతే.. ఎన్నటికీ ధనవంతుడు కాలేడు. డబ్బు ఖర్చు పెట్టే విధానంలో ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకపోతే అది పేదరికానికి దారి తీస్తుంది. అలాగే.. డబ్బును ఒకే చోట దాచిపెట్టడం.. ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల.. ఆ వ్యక్తి ఎప్పటికీ ధనవంతుడు కాలేడు.కొందరు తమకు రావాల్సిన డబ్బును తీసుకోవడానికే చాలా సిగ్గుపడుతుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే.. తనకు రావాల్సిన డబ్బును తీసుకోవడానికి వెనుకంజ వేసే వ్యక్తులు తమ జీవితంలో వ్యాపారంలో ముందుకు వెళ్లలేరు. వ్యాపారంలో రాణించలేరు.

chanakya niti quality every person should have to become rich

chanakya niti quality every person should have to become rich

Chanakya Niti : ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా ధనవంతుడు కావచ్చు

అటువంటి వ్యక్తి పేదవాడుగానే మిగిలిపోతాడు.డబ్బు ఉంది కదా అని అహంకారం చూపించకూడదు. డబ్బు కోసం కొందరు ఎటువంటి పని అయినా చేయడానికి వెనుకాడరు. కానీ.. అది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్లు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. డబ్బు ఉందని అహంకారం అస్సలు చూపించకూడదు. అలాగే.. డబ్బు సంపాదించడం కోసం పక్క దారులు పట్టకూడదు. తప్పుడు మార్గాన్ని అస్సలు ఎంచుకోకూడదు. అటువంటి వాళ్లు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు.జీవితంలో డబ్బు సంపాదించాలంటే నిజాయితీగా ఉండాలి. ఎంత నిజాయితీగా ఉంటూ సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదిస్తూ… డబ్బును ఆదా చేయడం తెలుసుకొని.. సరైన పద్ధతుల్లో డబ్బును పెట్టుబడి పెడితే ఎవ్వరైనా ధనవంతులు కావచ్చని చాణక్యుడు.. తన పుస్తకంలో వివరించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది