Chanakya Niti : చాణక్య నీతి.. ఈ పనులు చేస్తే మీ జీవితంలో సంక్షోభాలు.. అవేంటంటే?
Chanakya Niti : ప్రతీ మనిషి జీవితంలో పడే కష్టాలు, వాటిని ఎలా అధిగమించాలనే విషయాలపై చాణక్యుడు తన గ్రంథంలో వివరించాడు. ఈ క్రమంలోనే చాణక్యుడికి అపర చాణక్యుడిగా, మేధావిగా, లైఫ్ ఫిలాసఫర్, కోచ్ గా పేరొచ్చింది. కాగా, ఆయన చెప్పిన దాని ప్రకారం..ఈ పనులు చేస్తే కనుక మీ లైఫ్ లో సంక్షోభం తలెత్తే అవకాశాలుంటాయి. కాబట్టి వాటిని అస్సలు చేయకూడదని పెద్దలు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తన ‘నీతి శాస్త్రం’ గ్రంథంలో అపర చాణక్యుడు సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించాడు. ఈ క్రమంలోనే ఆయనకు గొప్ప పేరొచ్చింది. ఇకపోతే ప్రస్తుత తరుణంలో ప్రతీ ఒక్కరికి డబ్బు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్థిక విషయాలు చాలా ముఖ్యం కూడా.
ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం ప్రతీ ఒక్కరు చాలా కష్టపడుతుంటారు కూడా. కాగా, ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండేందుకుగాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పనులు చేయకుండా ఉండాలి? అనే విషయాలను ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథంలో వివరించాడు. అవేంటంటే..ఆర్థిక సంక్షోభానికి ప్రధానంగా ఈ అలవాట్లు కారణమవుతాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. అవేంటంటే.. అసమాన ఖర్చులు, డబ్బు వృథా చేయడం, ఆలస్యంగా నిద్రలేవడం. ఇవే ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయి. ఎలాగంటే..చాణక్య నీతి ప్రకారం.. మన ఆదాయానికి అనుగుణంగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Chanakya Niti said dont do these thing in life
Chanakya Niti : గొప్ప వ్యూహకర్త చాణక్యుడు…
ఎట్టి పరిస్థితులలోనూ ఆదాయం ఖర్చును మించి ఉండకూడదు. అందుకుగాను తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే డబ్బును పొదుపుగానే వాడుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే మనీని అస్సలు వృథా చేయొద్దు. ఇకపోతే ఉదయం వేళలో ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలా చేయడం వలన మీకు దరిద్రం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ఆచార్య చాణక్యుడు కూడా అదే తెలిపాడు. ప్రతీ రోజు సాధ్యం కాని పక్షంలో కనీసం వారంలో మూడు రోజులైనా మార్నింగ్ టైమ్స్ లో ఎర్లీ గా లేవాలని సూచించారు.