Chanakya Niti : చాణక్యుడు చెప్పిన ఈ పనులు చేస్తే.. సమాజంలో పెద్ద వారిగా మీకు గుర్తింపు.. అవేంటంటే?
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు ఎంతో తెలివైన వారు. మానవులకు ఎదురయ్యే సమస్యలన్నిటి గురించి ఆయన ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార మార్గాల గురించి తన ‘నీతి బోధ’ గ్రంథంలో వివరించారు. ఆయన చెప్పినట్లు సమాజంలో పెద్దవారిగా గుర్తింపు రావాలంటే కేవలం ఏజ్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఏజ్ కంటే ముఖ్యమైన ఈ పనులు చేస్తే కనుక మీరు ఆటోమేటిక్‌గా మీకు పెద్ద వారిగా గుర్తింపు లభిస్తుంది. ఆ పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య నీతి అనగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలను ఫాలో అయితే కనుక జీవితంలో చక్కటి విజయాలు, ఆనందం లభిస్తాయని పెద్దలు చెప్తున్నారు. ఇకపోతే సొసైటీలో మంచి వారిగా గుర్తింపు రావాలంటే చేసే పనుల పట్ల చిత్తశుద్ధి ఉండాలి.
తాను చేసే పనుల విషయంలో శ్రద్ధ వహించాలి. అలా శ్రద్ధ వహిస్తేనే మీకు మంచి గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని చూసి ఇతరులు ఇన్ స్పైర్ అవుతారు.ఇకపోతే చాలా మంది మనుషులకు గుర్తింపు వారికి ఉన్న ఆకారాన్ని బట్టి కూడా ఇస్తారని అనుకుంటారు. కానీ, ఆ అంచనా సరికాదని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఓ వ్యక్తి చేసే పనులు అతనిని నిలబెడతాయని వివరించారు. దాన ధర్మాలు, బలహీన వ్యక్తులకు చేసే సాయం, విరాళాలు మాత్రమే వ్యక్తిని గొప్పవాడిగా నిలబెడతాయి.

Chanakya Niti said will be recognised as good person in society
Chanakya Niti : పనులతోనే మీకు గుర్తింపు..
దాతృత్వం అనేది చాలా ముఖ్యమని, దాని వలనే కర్ణుడిని ఈనాటికి ప్రజలు గుర్తుంచుకుంటారని వివరించాడు.ఇకపోతే మనిషి మాట్లాడే మాటలు, సద్గుణాలు, ధైర్యం, ప్రవర్తన, దాతృత్వం వంటి యోగ్యతల ఆధారంగానే మంచితనం అనేది బయటకు వస్తుంది. అలా వ్యక్తి స్వభావం అతని మంచితనం వలన మాత్రమే బయటపడుతుందని, నలుగురు గుర్తిస్తారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు ఈ సూత్రాలను ఫాలో అయితే కనుక మీకు సమాజంలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మరి.. చాణక్యుడు చెప్పిన ఈ పనులు చేయండిక..