Chanakya Niti : చాణక్యుడినీతి బోధ.. వీరికి దూరంగా ఉంటే మీ లైఫ్‌లో విజయాలు..
Chanakya Niti : జీవితంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు తత్వం గురించి ఆచార్య చాణక్యుడు తన రచనల్లో వివరంగా తెలిపాడు. ఆచార్య చాణక్యుడి రచనలు చదివితే చాలు.. ప్రతీ ఒక్కరు జీవితంలో అత్యున్నత స్థాయిలకు వెళ్తారని పెద్దలు చెప్తుంటారు. అలా ఆచార్య చాణక్యుడు రచించిన ‘చాణక్య నీతి’ గ్రంథంలోని పలు విషయాలను గురించి ఇక్కడ ప్రస్తావిద్దాం. జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు ఏం చేయాలని చెప్పాడో తెలుసుకుందాం.భారతదేశంలో గొప్ప ఆచార్యుడిగా చాణక్యుడు పేరుగాంచాడు. ప్రతీ సారి పెద్దలు చాణక్యుడు పేరును ప్రస్తావిస్తుంటారు.
చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం.. ఎవరైనా వ్యక్తి ఎల్లప్పుడూ కొంతమంది వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. కొంత మంది వ్యక్తులతో కలిసి వారు జీవించడం వల్ల వారి జీవితాలు పూర్తిగా నాశనం అవుతాయని తెలిపాడు. ఈ క్రమంలోనే ఎవరితో ఫ్రెండ్ షిప్ చేయొద్దని విషయాన్ని గురించి చాణక్యుడు పలు సలహాలిచ్చాడు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలని చాణక్యుడు సూచించాడు. జీవితంలో సక్సెస్ అనేది మీ సొంతం కావాలంటే కంపల్సరీగా మంచి మనుషుల సాంగత్యం ఉండాలని తెలిపాడు.అత్యాశ లేదా దురాశ కలిగిన పర్సన్స్‌కు కూడా దూరంగా ఉండాలని, అలా అయితేనే జీవితంలో సక్సెస్ అవుతారని చాణక్యుడు తెలిపాడు.
Chanakya Niti : ఈ ముగ్గురికి దూరంగా ఉండాలి..
చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం.. మనలను ఎవరైతా ఆపద సమయాల్లో ఆదరిస్తారో వారిని మరిచిపోవద్దని చెప్పాడు. మనం కష్టాల్లో ఉన్నపుడు మనతో నిలబడిన వాడే మనకు నిజమైన స్నేహితుడని చాణక్యుడు వివరించాడు. నిజమైన స్నేహితుడు మన వద్ద ఏం లేకపోయినా ఎటువంటి సందర్భాల్లోనైనా మనతో ఉంటాడు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ మంచి మనుషుల సాంగత్యంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తే విజయం తప్పకుండా వరించి మన వద్దకు దానంతట అదే వస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఈ నీతి సూత్రాలనే పాటిస్తే సక్సెస్ మీ సొంతమవుతుంది.